కమీషన్లకు కక్కుర్తిపడి తాగునీటి పథకం నిలుపుదల: కాంగ్రెస్‌

ప్రజాశక్తి-చీమకుర్తి: కమీషన్లుకు కక్కుర్తిపడి అధికార పార్టీ నాయకులు 30 వేల మందికి తాగునీరు అందించే చీమకుర్తి మంచినీటి పథకాన్ని నిలుపుదల చేశారని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి రవి విమర్శించారు. శనివారం పట్టణ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు మద్ది వెంకటేశ్వర్లు నాయకత్వంలో మంచినీటి పథకాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా దాసరి రవి మాట్లాడుతూ 2018లో సెంట్రల్‌ ఆసియా అభివృద్ధి బ్యాంకు మంచినీటి పథకానికి రూ.68 కోట్లు రిలీజ్‌ చేయగా భూసేకరణ చేసి, నాగార్జున వర్క్స్‌ కంపెనీకి పనులు అప్పగించారు. అధికార పార్టీ నాయకులు కాంట్రాక్టరు నుంచి రూ.10 కోట్లు కమీషన్‌ డిమాండ్‌ చేశారన్నారు. కంపెనీ పనులు నిలుపుదల చేసిందన్నారు. రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీని ఓడించాలని కోరారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రజలకు నిరంతరం తాగునీరు అందిస్తుందన్నారు. ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సంతనూతలపాడు నియోజకవర్గ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు గుత్తిరాజు, వెంకటరావు, జానీ పాల్గొన్నారు.

➡️