కరపత్రాలు పంపిణీ

Jan 3,2024 21:54
కరపత్రాలు పంపిణీ చేస్తున్న దృశ్యం

కరపత్రాలు పంపిణీ చేస్తున్న దృశ్యం
కరపత్రాలు పంపిణీ
ప్రజాశక్తి-నెల్లూరు అర్బన్‌ :జనం కోసం జనసేన కార్యక్రమానికి ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తుందని జనసేన నగర అధ్యక్షుడు దుగ్గి శెట్టి సుజరు బాబు తెలిపారు. బుధవారం నగరంలోని 47వ డివిజన్‌ కుక్కలగుంట నుంచి జనం కోసం జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడ ఉన్న దుకాణాలకు వెళ్లి కరపత్రాలను అందజేశారు. ఆ ప్రాంతంలో బంగారు తీగ కార్మికులు ఉన్న నేపథ్యంలో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైసీపీ వైఫల్యాలను సూచించే కరపత్రాలను వారు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈసారి జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు సమయానికి జీతాలు అందక అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ అసమర్థ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఎక్కడ చూసినా గుంతలు పడిన రోడ్లు దర్శనమిస్తున్నాయని విమర్శించారు. కార్యక్రమంలో జనసేన రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి మన్వర్‌ బాషా, 47,48 డివిజన్‌ ఇన్‌ఛార్జిలు శ్రీమంతుల కిషోర్‌, సురేష్‌, నగర డివిజన్‌ అధ్యక్షులు పవన్‌ యాదవ్‌, శ్రీను ముదిరాజ్‌, శనివారపు అజరు బాబు, ఉదరు, జీవన్‌, బాలాజీ, డేవిడ్‌, కార్తీక్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️