కరువు నివారణ చర్యలు చేపట్టాలి

ప్రజాశక్తి-సిఎస్‌పురం: వర్షాభావ పరిస్థితుల వల్ల మండలంలో కరువు పరిస్థితులు ఏర్పడటం వల్ల రైతులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే కరువు నివారణ చర్యలు చేపట్టాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉప్పలపాడు సచివాలయంలో వ్యవసాయ కూలీలు గురువారం సచివాలయ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఉపాధి హామీ పనులు ఏడాదికి 200 రోజులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. వర్షాలు లేకపోవడం వల్ల కూలీలకు పనులు దొరక వలస వెళ్తున్నారని, పనులు కల్పించాలని వినతిపత్రంలో కోరారు. అలాగే ఇటీవల వచ్చిన మిచౌంగ్‌ తుపాను ప్రభావం వల్ల పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని కోరారు. వినతిపత్రం అందించిన వారిలో ఉప్పలపాడు గ్రామానికి చెందిన యేసురత్నం, భాగ్యరాజ్‌, ఆనందం, ఇజ్రాయిల్‌, దేవరాజు, జోసఫ్‌ తదితరులు ఉన్నారు.

➡️