కలెక్టరేట్‌లో రోడ్లకు శంకుస్థాపన

Jan 30,2024 00:28

ప్రజాశక్తి-గుంటూరు : కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో కాలుష్యరహిత రోడ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపా ల్‌రెడ్డి అన్నారు. సోమవా రం ఎన్‌ క్యాప్‌ నిధులతో కలెక్టరేట్‌ రోడ్ల మరమ్మ తులు, ఇన్నర్‌ రింగురోడ్డు ఏర్పాటు పనులకు జేసీ జి.రాజకుమారితో కలిసి కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ కాలుష్య రహిత నగరాల్లో భాగంగా నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ ప్రోగ్రాం (ఎన్‌.క్యాప్‌) ద్వారా నూతన రోడ్లకు కేటాయించిన రూ.30 లక్షల నిధులతో ఈ పనులు చేపట్టామన్నారు. నిత్యం ప్రజల రాకపోకలు చేసే జిల్లా కలెక్టరేట్‌, వ్యవసాయ శాఖ, ఆర్‌డిఒ, ఇవిఎం గోడౌన్‌, రిజిస్ట్రార్‌ కార్యాలయం, జిల్లా విద్యా శాఖ కార్యాలయం వైపుగా ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ను మెయిన్‌ రోడ్‌ వరకు నూతన రోడ్డు నిర్మాణం చేయనున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్‌ ఆర్డీఓ లక్ష్మీ కుమారి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ కె.స్వాతి, జిఎంసి ఎస్‌ఈ సుందరామిరెడ్డి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️