కాంగ్రెస్‌ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు రిహానాబానుకు సన్మానం

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: కాంగ్రెస్‌ పార్టీ జిల్లా మహిళాధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన రిహానా బానుకు మంగళవారం యర్రగొండపాలెంలో మహిళల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రిహానా బాను మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యంగా పశ్చిమ ప్రకాశంలోని మహిళల సమస్యల పరిష్కారం కోసం విశేషంగా కృషి చేస్తానని తెలిపారు. తనపై ఎంతో నమ్మకంతో పీసీసీ చీఫ్‌ షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్‌ పార్టీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు తాంతియ కుమారి తనకు జిల్లా మహిళాధ్యక్షురాలుగా బాధ్యతలు అప్పగించారని తెలిపారు. వారి నమ్మకాన్ని వమ్ము చేసుకుండా పార్టీ అభివృద్ధికి సైతం కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో గాలిబ్‌బీతో పాటు పలువురు మహిళలు పాల్గొన్నారు.

➡️