కానిస్టేబుల్‌ గోపిరెడ్డి అంత్యక్రియలు

పల్నాడు జిల్లా: ఆర్టీసీ బస్సు ఢకొీన్న ఘటనలో మృతి చెందిన కానిస్టేబుల్‌ శవనం గోపిరెడ్డి అంత్య క్రియలు సోమవారం బాపట్ల పట్టణం ఉప్పెర పాలెంలో పోలీసు లాంఛనాలతో నిర్వహించారు. పల్నాడు జిల్లా ఎస్పీ వై.రవిశంకర్‌ రెడ్డి ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏ. ఆర్‌ కానిస్టేబుల్‌ గోపిరెడ్డి మృత దేహానికి పల్నాడు జిల్లా ఏఆర్‌ డిఎస్పీ జి.ఎం గాంధీ సిబ్బందితో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా పోలీస్‌ శాఖ తరపున మట్టి ఖర్చుల నిమిత్తం రూ.25 వేల చెక్కును అతని కుటుంబ సభ్యులకు అందజేశారు. పోలీస్‌ శాఖ తరపున ఏఆర్‌ కానిస్టేబుల్‌ కుటుంబానికి పోలీసు శాఖ నుండి రావాల్సిన అన్ని బెనిఫిట్స్‌ ను సకాలంలో అందజేస్తామని ,గోపిరెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏఆర్‌ డిఎస్పి జిఎం గాంధీ ఆర్‌ ఐ ఎల్‌ గోపీనాథ్‌ పోలీస్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ మాణిక్యాలరావు సిబ్బంది పాల్గొన్నారు.

గోపిరెడ్డి మృతి బాధాకరం: ఎమ్మెల్యే పిన్నెల్లి 

ప్రభుత్వ విప్‌ మాచర్ల శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యక్తిగత గన్‌ మెన్‌ గోపిరెడ్డి మృతిపై ఆయన, వైఎస్‌ఆర్సిపి రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షులు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. రామకృష్ణారెడ్డి, వెంకటరామిరెడ్డి సోమవారం గోపిరెడ్డి స్వగ్రామా నికి వెళ్లి అతని పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు.

➡️