కార్యకర్తలకు అందుబాటులో ఉండేది మేమే

Jan 6,2024 20:54

ప్రజాశక్తి – పూసపాటిరేగ : అర్ధరాత్రి అయినా విజయనగరంలో కార్యకర్తల అవసరా లకు తాను, జిల్లా పరిషత్తు చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు అందుబాటులో ఉంటామని, టిడిపిలో అటువంటి వారెవరైనా విజయనగరంలో ఉన్నారా అని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభధ్రస్వామి ప్రశ్నించారు. శనివారం స్ధానిక ఎఎంసి కార్యాలయం వద్ద పూసపాటిరేగ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా చిక్కాల అరుణ, ఆమెతో పాటు 11 మంది డైరెక్టర్‌లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా స్వామి మాట్లా డుతూ కష్టపడే కార్యకర్తకు ఈ ప్రభుత్వం పెద్దపీఠ వేస్తుందన్నారు. జిల్లా పరిషత్‌ అధ్యక్షలు మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం చూస్తున్న ఇటువంటి ప్రభుత్వాన్ని, ముఖ్య మంత్రిని మరోసారి గెలిపించుకోవాలన్నారు. త్వరలో విశాఖపట్నం, విజయనగరం జంట నగరాలుగా మారే అవకాశం ఉందన్నారు. మన ప్రాంత అభివృద్ది వైసిపి గెలుపుతోనే సాధ్యమన్నారు. మరోసారి మీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడును గెలిపించి జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పల నాయుడు మాట్లాడుతూ సాంబ పార్టీలోకి వచ్చినప్పుడే సముచిత స్ధానం కల్పిస్తామని చెప్పామన్నారు. అవకాశం రావడంతో చైర్‌పర్సన్‌ హోదా ఇచ్చామన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారందరిని గుర్తిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కందుల రఘుబాబు, కెవి సూర్యనా రాయణ రాజు, ఎంపిపిలు అంబళ్ల సుధారాణి, మహంతి కళ్యాణి, బంటు పల్లి వాసుదేవరావు, జెడ్‌పిటిసి గదల సన్యాసినాయుడు, వైసిపి మండల అధ్యక్షలు పతివాడ అప్పలనాయుడు, నాయకులు జనార్ధనరావు, పుప్పాల లక్ష్మినారాయణ, జెసిఎస్‌ కన్వినర్‌ మహంతి శ్రీనువాసరావు, చనుమల్లు వెంకటరమణ, చిక్కాల సాంబ, సర్పంచులు, పాల్గొన్నారు.

➡️