కార్ల్‌ మార్క్స్‌కు ఘన నివాళి

Mar 14,2024 22:57

కారల్‌ మార్క్స్‌ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న గద్దె చలమయ్య తదితరులు
ప్రజాశక్తి – సత్తెనపల్లి టౌన్‌ :
మార్క్సిస్టు సిద్ధాంత కర్త, మానవళి విముక్తి మార్గదర్శకులు కారల్‌ మార్క్స్‌ 141వ వర్థంతిని స్థానిక సిపిఎం కార్యాలయంలో గురువారం నిర్వహించారు. సభకు సిపిఎం మండల కార్యదర్శి పి.మహేష్‌ అధ్యక్షత వహించారు. రాష్ట్ర కమిటీ మాజీ సభ్యులు గద్దె చలమయ్య మాట్లాడుతూ మార్క్స్‌ గొప్పతనాన్ని, మానవ సమాజానికి ఆయన అందించిన సేవలను గుర్తు చేశారు. మార్క్స్‌ చనిపోయినప్పుడు ఫెడరిక్‌ ఏంగెల్స్‌ చేసిన ప్రశంగాన్ని వివరించారు. వర్గ పోరాటామే సమాజ మనుగడకు చోదక శక్తిగా పని చేస్తుందని, మార్క్స్‌ అందించిన ఈ సిద్ధాంతం అజరామరమని అన్నారు. సమాజంలో నెలకొన్న అనేక అసమానతలకు అణిచివేతలకు, దురాచారాలకు మూలం దోపిడీ అని, శ్రమ దోపిడీ లేని సమాజం కోసం మార్క్స్‌ సిద్ధాంత బాటలో పయనిద్దామని చెప్పారు. తొలుత మార్క్స్‌ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సభలో సిపిఎం పట్టణ కార్యదర్శి డి.విమల, నాయకులు వి.వి.శివనాగరాణి, జి.రజనీ, రాజకుమార్‌, ఎ.వెంకటనారాయణ, ఎం.నరసింహారావు, బి.వెంకటేశ్వర్లు, బి.రామారావు, భగత్‌ పాల్గొన్నారు.ప్రజాశక్తి-ముప్పాళ్ల : మండలంలోని మాదల గ్రామంలో సిపిఎం కార్యాలయంలో మార్క్స్‌ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఆ పార్టీ మండల కార్యదర్శి జి.బాలకృష్ణ మాట్లాడారు. అసమానతలకు, అణిచివేతలకు, దురాచా రాలకు మూలం శ్రమ దోపిడీ అని, దాన్ని నిర్మూలించాలంటే వర్గ పోరాటామే మార్గమనే సిద్ధాంతాన్ని మానవాళికి కార్ల్‌ మార్క్స్‌ అందించారని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు ఎం.వెంకటరెడ్డి, జి.జాలయ్య, పి.సైదాఖాన్‌, కె.నాగేశ్వరరావు, సిహెచ్‌.నాగమల్లేశ్వరరావు పాల్గొన్నారు.

➡️