కిట్లు పంపిణీ

Jan 8,2024 21:37
ఆడుదాం- ఆంధ్రా కిట్లు పంపిణీచేస్తున్న దృశ్యం

ఆడుదాం- ఆంధ్రా కిట్లు పంపిణీచేస్తున్న దృశ్యం
కిట్లు పంపిణీ
ప్రజాశక్తి-నెల్లూరు అర్బన్‌ :ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో గెలుపొందిన క్రీడాకారులకు నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు, రూరల్‌ ఇన్చార్జి ఆదాల ప్రభాకర్‌ రెడ్డి ఆయా క్రీడలకు సంబంధించిన కిట్లను అందించారు. అదేవిధంగా జన్‌ బగీదరీ కార్యక్రమాన్ని పురస్కరించుకొని నెల్లూరు రూరల్‌ ఎంపీపీ కార్యాలయంలో సోమవారం భారతరత్న డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ చిత్రపటానికి ఎంపి ఆదాల ప్రభాకర్‌ రెడ్డి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. యువతీ యువకుల్లో దాగున్న క్రీడ ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రా పేరుతో ప్రతిష్టాత్మకంగా పోటీలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. క్రీడలను ప్రోత్సహించేందుకు, గ్రామీణ క్రీడాకారులకు తోడ్పాటు అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆలోచన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో సమర్థవంతంగా జరుగుతున్నాయని తెలిపారు.

➡️