కిమ్స్‌ ఆస్పత్రిలో సెమీ క్రిస్మస్‌ వేడుకలు

Dec 20,2023 19:20
క్రిస్మస్‌ కేక్‌ కట్‌ చేస్తున్న దృశ్యం

క్రిస్మస్‌ కేక్‌ కట్‌ చేస్తున్న దృశ్యం
కిమ్స్‌ ఆస్పత్రిలో సెమీ క్రిస్మస్‌ వేడుకలు
ప్రజాశక్తి -నెల్లూరు నగరంలోని కిమ్స్‌ ఆస్పత్రిలో బుధవారం సెమీ క్రిస్మస్‌ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా శాంతాక్లాస్‌, వైద్య సిబ్బంది ద్వారా క్రిస్మస్‌ కేక్‌ కట్‌ చేయించారు. ఈ సందర్భంగా గిరినాయుడు మాట్లాడుతూ క్రీస్తు బోధనలు ఆచరణీయమని పేర్కొన్నారు. ప్రతినిత్యం పని ఒత్తిడిలో ఉండే సూపర్‌ ష్పెషలిస్టు, స్పెషలిస్టు డాక్టర్లు కోవిడ్‌ లాంటి అత్యవసర పరిస్థితుల్లో కూడా నిరసంతరం వైద్యసేవలందిస్తూ ఇటువంటి కార్యక్రమాల ద్వారా కొంత పని ఒత్తిడి తగ్గించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో నర్సింగ్‌ సిబ్బంది, టెక్నిషియన్లు, అడ్మినిస్ట్రేటివ్‌ హౌస్‌ కీపింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన అందరికీ కిమ్స్‌ ఆస్పత్రి తరపున శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన డ్యాన్స్‌ పోటీలు, ఫన్నీ గేమ్స్‌ అందరినీ అలరించాయి.

➡️