కుంగిన ఏటిగట్టు రోడ్డు

కుండలేశ్వరం వద్ద దిగబడిన ఏటిగట్టు రోడ్డు

ప్రజాశక్తి-కాట్రేనికోన

కుండళేశ్వరం వద్ద ఏటిగట్టు రోడ్డు కుంగిపోయింది. పల్లంకుర్రు నుంచి చింతపల్లి లంక వరకూ సుమారు పది కిలోమీటర్ల వరకూ రూ.పదికోట్లతో ఇటీవల నిర్మించిన ఏటిగట్టు రోడ్డు పనులు ఇంకా పూర్తికాలేదు. ఒక పక్క పనులు జరుగుతుండగా మరోపక్క ఏటిగట్టు రోడ్డు దిగబడిపోవడంతో స్దానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుత్తేదారు నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు అంటున్నారు. దీనితో పల్లంకుర్రు నుంచి మురమళ్ల వెళ్లే వాహనదారులకు ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది. దిగబడిన రోడ్టును వెంటనే సరిచేయాలని, గుత్తేదారుపై కఠిన చర్యలు తీసుకోవాలని స్దానికులు కోరుతున్నారు.

 

 

➡️