కుట్టు శిక్షణ అభ్యర్థులకు సర్టిఫికెట్లు

Dec 17,2023 20:50

ప్రజాశక్తి-విజయనగరం :  స్థానిక తోటపాలెంలో గల సత్య డిగ్రీ, పీజీ కళాశాలలో ధీర ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రెండు నెలల పాటు నిర్వహించిన కుట్టు పనిపై శిక్షణ పొందిన అభ్యర్థులకు ఆదివారం సర్టిఫికెట్లు అందజేశారు. ధీర ఫౌండేషన్‌ ఫౌండర్‌ డాక్టర్‌ బొత్స సందీప్‌, ఆయన సతీమణి పూజిత, మాజీ ఎంపి బొత్స ఝాన్సీ లక్ష్మి చేతులు మీదుగా 60 మందికి సర్టిఫికెట్లు అందజేశారు. బొత్స సందీప్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఝాన్సీ లక్ష్మి మాట్లాడుతూ ధీర ఫౌండేషన్‌ గత మూడేళ్లగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తున్నదని అన్నారు. సందీప్‌ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ తమ వంతు సహకారం అందించడానికి ధీర ఫౌండేషన్‌ ముందు వుంటుందని పేర్కొన్నారు. సత్య కళాశాల సంచాలకులు డాక్టర్‌ ఎం శశి భూషణ రావు, కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎంవి సాయి దేవమణి, తదితరులు పాల్గొన్నారు.

➡️