కుష్టు వ్యాధిపై ఇంటింటి సర్వే

Dec 26,2023 21:47

ప్రజాశక్తి-విజయనగరం కోట  :  జిల్లాలో జాతీయ కుష్టువ్యాధి నిర్మూలనలో భాగంగా కుష్టు ఇంటింటి సర్వే ఈనెల 27నుంచి వచ్చే జనవరి 12 వరకు నిర్వహించనున్నట్లు డిఎంహెచ్‌ఒ భాస్కరరావు, జిల్లా లెప్రసీ ఎయిడ్స్‌ నివారణ అధికారి డాక్టర్‌ రాణి తెలిపారు. మంగళవారం ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అందులో భాగంగా కుష్టు అనుమానితులను గుర్తించేందుకు ఆశా కార్యకర్తలు, వాలంటీర్‌ ఇంటింటినీ సందర్శించి చర్మంపై ఏర్పడిన మచ్చలు , ఇటీవల వచ్చిన అంగవైకల్యం ఉన్న వారిని గుర్తిస్తారని తెలిపారు. కుష్టు నిర్మూలనకు తగు చర్యలు తీసుకుంటా మన్నారు. జిల్లాలో గత ఏడాది సర్వేలో 112 కేసులు ఈ ఏడాది 106 కేసులు గుర్తించామన్నారు. 2027 నాటికీ లెప్రసి కేసులు జీరో శాతం చేయాలన్నదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యం కావున ప్రజలంతా సర్వే లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

➡️