కెఎస్‌.భరత్‌కు ఘనసత్కారం

కోన శ్రీకర్‌ భరత్‌

ప్రజాశక్తి -పిఎం పాలెం: భారత్‌, ఇంగ్లండ్‌ రెండో టెస్ట్‌మ్యాచ్‌లో సొంతగడ్డపై తొలిమ్యాచ్‌ ఆడుతున్న క్రికెటర్‌ కోన శ్రీకర్‌ భరత్‌ను గురువారం ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్‌ ఎసిఎ విడిసిఎ అంతర్జాతీయ స్టేడియంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అభినందన సభలో సిటీ పోలీస్‌ కమిషనర్‌ రవిశంకర్‌ మాట్లాడుతూ, విశాఖలోనే పుట్టి, పెరిగిన కెఎస్‌.భరత్‌, సొంతూరులో నిర్వహిస్తున్న క్రికెట్‌ టెస్టు మ్యాచ్‌లో భారత్‌ తరపున ఆడటం గర్వించదగ్గ విషయం అన్నారు. ఎసిఎ కార్యదర్శి ఎస్‌.ఆర్‌. గోపినాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. బ్యాటింగ్‌, వికెట్‌ కీపింగ్‌లో మంచి ప్రతిభ వల్లే భరత్‌ ఈ స్థాయికి చేరాడన్నారు. విశాఖ మ్యాచ్‌లో భరత్‌ రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎసిఎ కోశాధికారి ఎవి.చలం, సిఇఒ డాక్టర్‌ ఎంవి.శివారెడ్డి, అపెక్స్‌ కౌన్సిల్‌ మెంబర్‌ఎన్‌.గీత, విడిసిఎ కార్యదర్శి కె.పార్థసారథి, సిఎఫ్‌ఒ ఎం.నవీన్‌ కుమార్‌, గేమ్‌ డెవలప్‌మెంట్‌, ఆపరేషన్స్‌ జనరల్‌ మేనేజర్లు ఎంఎస్‌.కుమార్‌, ఎస్‌ఎంఎన్‌.రోహిత్‌, కేెఎస్‌ భరత్‌ కుటుంబసభ్యులు, కోచ్‌ కృష్ణారావు పాల్గొన్నారు.పూర్వ విద్యార్థి భరత్‌కు బుల్లయ్యకాలేజీ శుభాకాంక్షలుసీతమ్మధార : నగరంలోని విసిఎ, పిడిసిఎ స్టేడియంలో శుక్రవారం నుంచి జరగనున్న భారత్‌ ఇంగ్లాండ్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో కీపర్‌, బ్యాట్స్‌మెన్‌గా ఆడుతున్న డాక్టర్‌ లంకపల్లి బుల్లయ్య కళాశాల పూర్వ విద్యార్థి, క్రికెటర్‌ కెఎస్‌.భరత్‌కు కాలేజీ కార్యదర్శి డాక్టర్‌ జి.మధుకుమార్‌, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు. సొంతూరులో జరుగుతున్న మ్యాచ్‌లో విశేషంగా రాణించి, భారతజట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మధుకుమార్‌ మాట్లాడుతూ, స్వర్ణోత్సవం జరుపుకున్న బుల్లయ్యకాలేజీ ఎంతోమంది ప్రముఖ క్రీడాకారులను తయారు చేసి, వారి ప్రగతికి ప్రోత్సహించిందన్నారు.కెఎస్‌.భరత్‌ వంటి పూర్వ విద్యార్థులను ఆదర్శంగా తీసుకొని నేటితరం కష్టపడి అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

భరత్‌ను సత్కరిస్తున్న సిపి, ఎసిఎ ప్రతినిధులు

➡️