కొనసాగిన న్యాయవాదుల దీక్షలు

ప్రజాశక్తి – భీమడోలు

ఎపి భూ హక్కుల యాజమాన్య చట్టం రద్దు చేయాలని కోరుతూ భీమడోలు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారంతో రెండో రోజుకు చేరాయి. భీమడోలు జంక్షన్‌లో ఏర్పాటు చేసిన శిబిరంలో కాలి గంగరాజు, ఓగిరాల ప్రసాద్‌ రిలే నిరాహార దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా న్యాయవాదులు కాలి నాగేశ్వరరావు, గంగరాజుతో పాటు రాజారావు ప్రసంగించారు.

➡️