కొనసాగుతున్న అంగన్‌వాడీ సమ్మె

Dec 26,2023 20:35
ఫొటో : ప్లేట్లు గరిటెలతో తప్పెట్లు మోగించి తమ నిరసన తెలియజేస్తున్న అంగన్‌వాడీల

ఫొటో : ప్లేట్లు గరిటెలతో తప్పెట్లు మోగించి తమ నిరసన తెలియజేస్తున్న అంగన్‌వాడీల
కొనసాగుతున్న అంగన్‌వాడీ సమ్మె
ప్రజాశక్తి-వరికుంటపాడు : అంగన్‌వాడీ ఉద్యోగుల న్యాయమైన కోరికలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం మండలంలోని తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ప్లేట్లు గరిటెలతో తప్పెట్లు మోగించి తమ నిరసనను వినూత్నంగా తెలియబరిచారు. ఈ సందర్భంగా సిఐటియు అంగన్‌వాడీ యూనియన్‌ అధ్యక్షురాలు షేక్‌ రజియా మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 15 రోజుల నుంచి సమ్మె చేస్తున్న ముఖ్యమంత్రి పట్టించుకోకుండా ఉన్నారన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించాలని, న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీనే అడుగుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.

➡️