కొనసాగుతున్న ‘ఇంటూరి’ ఇంటింటా ప్రచారం

Dec 17,2023 18:23
ప్రచారం నిర్వహిస్తున్న ఇంటూరి నాగేశ్వరరావు

ప్రచారం నిర్వహిస్తున్న ఇంటూరి నాగేశ్వరరావు
కొనసాగుతున్న ‘ఇంటూరి’ ఇంటింటా ప్రచారం
ప్రజాశక్తి-కందుకూరు : బాబూ ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 24, 25 వార్డుల పరిధిలోని ఎర్రవడ్డిపాలెం, గుర్రంవారిపాలెం ఉత్తరం వైపు ప్రాంతాల్లో టిడిపి కందుకూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు ఆదివారం విస్తత ప్రచారం నిర్వహించారు. టిడిపి మినీమేనిఫెస్టో వివరిస్తూ కరపత్రాలు, ష్యూరిటీ బాండ్లను స్థానికులకు పార్టీ నాయకులు అందజేశారు. ప్రధానంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని నాగేశ్వరరావు వెంట నడిచారు. ఇంటింటికి వెళ్లి పథకాలపై అవగాహన కల్పించారు. రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో కందుకూరు పట్టణంలోని వివిధ వర్గాల ప్రజలకు ఎలాంటి పాలన అందిస్తామో వివరిస్తూ, సమస్యల పరిష్కారానికి ఇంటూరి నాగేశ్వరరావు హామీనిచ్చారు. పట్టణ పార్టీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి ముచ్చు శీను, వార్డు అధ్యక్షులు మదిరి మధు, గుర్రం మాల్యాద్రి, శ్రీపతి మురళీకష్ణ,పి.బీమా, మదిరి వెంకటేశ్వర్లు, షేక్‌ ఖాజావలి, వీరబ్రహ్మం, కొండలరావు, బ్రహ్మయ్య, శీను, నరసింహ, గుర్రం మల్లికార్జున, కిషోర్‌, శంకర్‌, మురకొండ రామారావు, నవులూరి కొండయ్య, అబ్బూరి ప్రసాద్‌, పెంట్రాల సుబ్బారావు, చిట్టాబత్తిని మాలకొండయ్య ఉన్నారు.

➡️