కొవ్వొత్తులతో ర్యాలీ

కొవ్వొత్తులతో ర్యాలీప్రజాశక్తి-కనిగిరిగీతాంజలి మతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పులి శాంతి, వైసిపి రాష్ట్ర మహిళా కార్యదర్శి తమ్మినేని సుజాత రెడ్డిలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గీతాంజలి మతికి సానుభూతిని తెలియజేస్తూ వైసిపి మహిళా విభాగం కనిగిరి పట్టణంలో బుధవారం రాత్రి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి.. నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ గఫార్‌, ఎంపీపీ దంతులూరి ప్రకాశం, వైసిపి నాయకులు తమ్మినేని శ్రీరామ్‌ రెడ్డి , డాక్టర్‌ నాయిబ్‌ రసూల్‌, మన్సూర్‌, మహిళా కౌన్సిలర్లు షేక్‌ జాస్మిన్‌, దేవకి సత్యవతి పాల్గొన్నారు.

➡️