క్రమశిక్షణ ఎలా ఉంటుందో చూపిస్తా : మంత్రి

శింగరాయకొండ : శింగరాయకొండ మండలం మూలగుంటపాడులోని శ్రీ వెంకటేశ్వర కల్యాణమండపంలో వైసిపి నాయకులతో రాష్ట్ర మున్సిపల్‌ పట్టణాభివద్ధి శాఖ మంత్రి, వైసిపి కొండపి నియోజక వర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసిపి నాయకులను పరిచయం చేసుకొని ఒక్కొక్కరితో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అందరికీ పదవులు ఉన్నాయని, కొంతమంది క్రమశిక్షణలో లేరని తెలిపారు. ఇప్పటి వరకూ ఎలా ఉన్నారో నాకు తెలియదని, ఇకనుంచి క్రమశిక్షణతో ఉండాలన్నారు. కొంతమంది నాయకులు గొప్పలు చెప్పుకుంటూ వెళుతుండగా వారిని మంత్రి హెచ్చరించారు. క్రమశిక్షణ అంటే ఏదో తాను చూపిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షుడు సామంతుల రవికుమార్‌ రెడ్డి, సర్పంచి తాటిపర్తి వనజ, వైసిపి పట్టణ అధ్యక్షుడు షేక్‌ పటేల్‌ షేక్‌ సలీంబాషా, షేక్‌ సలీం, షేక్‌ కరీం, వైసిపి నాయకులు పాల్గొన్నారు.

➡️