క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభం

Feb 29,2024 23:54 #అశోక్‌

ప్రజాశక్తి-హనుమంతునిపాడు : మండల పరిధిలోని ఉసులపల్లె గ్రామంలో కనిగిరి నియోజకవర్గ స్థాయిలో మెగా క్రికెట్‌ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్‌ను టోర్నమెంట్‌ కమిటీ సభ్యులు, వైసిపి నాయకులు గురువారం ప్రారంభించారు. విజేతలకు ప్రథమ బహుమతిగా రూ. 20,116 దాత బేతం అశోక్‌, ద్వితీయ బహుమతిగా రూ.15,116 దాత తెల్లగడ్డ వెంకట్రావు అందజేయనున్నట్లు తెలిపారు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌, మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ ప్రత్యేక బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈద దేవయ్య, బేతం ఇస్సాక్‌, బేతం ప్రసాద్‌,మురళి రూబేన్‌, క్రాంతి, ప్రేమ్‌, క్రికెట్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

➡️