క్రికెట్‌ నెట్‌ ప్రాక్టీస్‌ కోర్టు ప్రారంభం

ఐటిడిఎ పిఒ చైతన్య, ఎఎస్‌పి జగదీష్‌, జమాల్‌ ఖాన్‌లకు స్వాగతం పలుకుతున్న దృశ్యం

ప్రజాశక్తి-చింతూరు :

చింతూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో జమాల్‌ ఖాన్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో 3.5 లక్షలతో నిర్మించిన క్రికెట్‌ నెట్‌ ప్రాక్టీస్‌ కోర్టును బుధవారం ఐటీడీఏ పిఒ కావూరి చైతన్య ప్రారంభించారు. లాంగ్‌ జంప్‌ కోర్టును విద్యార్థులు, క్రికెట్‌ నెట్‌ ప్రాక్టీస్‌ కోర్టు రెండో భాగాన్ని చింతూరు ఎంపీపీ అమల చేతులమీదుగా ప్రారంభించారు. దీనికి ముందు ట్రస్టు అధ్యక్షులు జమాల్‌ ఖాన్‌ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. గిరిజన సాంప్రదాయ డోలు కొమ్ముల నృత్యాలతో పిఓ, ఓఎస్‌డి మహేశ్వర్‌రెడ్డి, జమాల్‌ ఖాన్‌లకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఐటీడీఏ పీవో చైతన్య, ఓఎస్‌డి మహేశ్వర్‌ రెడ్డి క్రికెట్‌ బౌలింగ్‌ బ్యాటింగ్‌ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జమాల్‌ ఖాన్‌ మాట్లాడుతూ చింతూరు క్రికెట్‌ యూత్‌ అసోసియేషన్‌ యువకులు క్రికెట్‌ ప్రాక్టీస్‌కు నెట్‌ కోర్టు కావాలని కోరిన వెంటనే ఖర్చుకు వెనుకాడకుండా దీనిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అనంతరం జమాల్‌ ఖాన్‌ను సత్కరించారు. జాతీయస్థాయి వెయిట్‌ లిఫ్టింగ్‌లో ప్రతిభ కనబరిచి కస్తూరిబా విద్యార్థిని మధు చందన, కోచ్‌ గంగాధర్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ ఎంపిపి చిన్ని, ఎంపీడీవో రవిబాబు, ఎంఈఓ లక్ష్మీనారాయణ, సీఐ గజేంద్ర కుమార్‌, సిపిఎం మండల కార్యదర్శి సీసం సురేష్‌, టిడిపి మండల అధ్యక్షుడు ఇల్లా చిన్నారెడ్డి, పాఠశాల హెచ్‌ఎం శ్యామల సుబ్బయ్య, ట్రస్టు సెక్రటరీ ఎండి ఇమ్రాన్‌ ఖాన్‌, ఇన్చార్జి సుభాని, సిబ్బంది శేఖర్‌, క్రికెట్‌ యూత్‌ సభ్యులు రియాజ్‌, గణేష్‌ పాల్గొన్నారు.

➡️