క్రీడలతో మానసికోల్లాసం : జెసి

ప్రజాశక్తి – ముద్దనూరు క్రీడలతో శారీరక ధృఢత్వంతోపాటు మానసకోల్లాసం కలుగుతుందని జాయింట్‌ కలెక్టర్‌ గణేష్‌ కుమార్‌ అన్నారు. మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో జరుగుతున్న ఆడుదాం ఆంధ్ర క్రీడలను గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం మండల వ్యాప్తంగా జరుగుతున్న క్రీడల గురించి అధికారులతో చర్చించి, పలు సూచనలు చేశారు. వాలీబాల్‌ క్రీడాకారులను స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ రామునాయక్‌ పరిచయం చేసుకున్నారు. కార్యక్రమంలో ఎంపిడిఒ సూర్యనారాయణరెడ్డి, తహశీల్దార్‌ వెంకటేశ్వర్లు, ఎంఇఒలు సుబ్బారావు, నాగేశ్వర నాయక్‌, ఈఓపిఆర్డీ వీరభద్రుడు, ప్రధానోపాధ్యాయులు రాజబాబు, సెక్రటరీలు సుమలత, వ్యాయామ ఉపాధ్యాయులు మాధవరెడ్డి, దేవిక, యోగా మాస్టర్‌ రాంకుమార్‌ పాల్గొన్నారు.ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల నగర పంచాయతీ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ క్రీడా ప్రాంగాణంలో నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర క్రీడలను గురువారం జాయింట్‌ కలెక్టర్‌ గణేష్‌కుమార్‌ పరిశీలించారు. క్రీడాకారులకు ప్రధమ చికిత్స, తాగునీరు, స్కోరు బోర్డు తదితర సదుపాయాలపై మున్సిపల్‌ కమిషనర్‌ పి.జగన్నాథ్‌ను అడిగి తెలుసుకున్నారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు కల్పించాలని జెసి ఆదేశించారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ నాగేశ్వరరావు, డిపిఒ వినోద్‌, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

➡️