క్రీడలతో మానసిక ఉల్లాసం..

Jan 13,2024 21:24
ఫొటో : మాట్లాడుతున్న బొమ్మిరెడ్డి తారక్‌నాథ్‌రెడ్డి

ఫొటో : మాట్లాడుతున్న బొమ్మిరెడ్డి తారక్‌నాథ్‌రెడ్డి
క్రీడలతో మానసిక ఉల్లాసం..
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : క్రీడలతో మానసిక ఉల్లాసం పెంపొందించవచ్చని డాక్టర్‌ బిఎస్‌ఆర్‌ వైద్యశాల మేనేజింగ్‌ డైరెక్టర్‌ బొమ్మిరెడ్డి తారక్‌నాథ్‌ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆత్మకూరు పట్టణంలోని డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆటల పోటీలు ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన బొమ్మిరెడ్డి తారక్‌నాగిరెడ్డి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో గత 40యేళ్లుగా నుండి క్రీడలను నిర్వహించడం ఎంతో గర్వకారణమన్నారు. అనంతరం ఆయన క్రికెట్‌ ఆటను బ్యాటింగ్‌ చేసి ప్రారంభించారు. క్రీడాకారులను అందించారు. ఆత్మకూరు పట్టణంలోని ఫుట్‌బాల్‌ క్రీడను ఉమ్మడి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు ఎమ్‌డి సాదిక్‌ హుస్సేన్‌ ప్రారంభించారు. వాలీబాల్‌ క్రీడను మాజీ డివైఎఫ్‌ఐ నాయకులు కోడమేకల శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్థానిక బస్టాండ్‌ ఆవరణంలో ఉన్న డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ విగ్రహం వద్ద సిపిఎం మాజీ పట్టణ కార్యదర్శి ఎం.నాగేంద్ర జెండా ఊపి ప్రారంభించారు. ప్రస్తుత సిపిఎం పట్టణ కార్యదర్శి డేవిడ్‌ రాజు క్రీడాప్రాంగణాన్ని రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా మాజీ మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ ఎస్‌.కె.సంధాని వ్యవహరించారు. డివైఎఫ్‌ఐ నాయకులు నందా శ్రీనివాసులు జెండా వందనం చేశారు. సిపిఎం సీనియర్‌ నేత జక్కా వెంకయ్య చిత్రపటానికి ఎపి రైతుసంఘం నాయకులు లక్కు కృష్ణప్రసాద్‌, సిఐటియు నాయకులు జివి శివప్రసాద్‌ పూలమాలలేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ నాయకులు ఆళ్ల హజరత్తయ్య, ఖాదర్‌, రిచర్డ్‌, రాజేష్‌, శ్రీకాంత్‌, చక్రి, తదితరులు పాల్గొన్నారు.

➡️