గణతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం

ప్రజాశక్తి-రాయచోటి 75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు స్థానిక పోలీసుపరేడ్‌ మైదానం ముస్తాబైంది. శుక్రవారం పోలీసు పరేడ్‌ మైదానంలో 75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా కనుల పండువుగా ఉదయం 8.45 వేడుకలు ప్రారంభం అవుతాయి. ఈ వేడుకలలో ముఖ్యఅతిథిచే జాతీయ పతాకం ఆవిష్కరణ, పోలీసుల కవాతు మార్చ్‌ ఫాస్ట్‌, ప్రజలకు కలెక్టర్‌ సందేశం, పోలీసు జాగిలాల విన్యాసాలు, జిల్లా ప్రగతిని చాటే శకటాల ప్రదర్శన, సాంస్క తిక కార్యక్రమాలు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు, ప్రభుత్వ అభివ ద్ధి సంక్షేమ కార్యక్రమాల ఎగ్జిబిషన్‌ స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. ఇన్‌ఛార్జి కలెక్టర్‌, ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసు పరేడ్‌ మైదానంలో వేడుకలకు పక్కాగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ కార్యాలయాన్ని కూడా రంగురంగుల విద్యుత్‌ దీపాలతో అలంకరణ చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొనే అధికారులు, సిబ్బంది సమన్వయంతో వేడుకలను విజయవంతం చేయాలని ఇన్‌ఛార్జి కలెక్టర్‌ పర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ కోరారు.

➡️