గిరిజనులతో ట్రైనీ కలెక్టర్‌ ముఖాముఖి

Feb 1,2024 21:31

ప్రజాశక్తి-గంట్యాడ  : ఐఎఎస్‌ శిక్షణలో భాగంగా జిల్లాలో శిక్షణ పొందుతున్న బిఎస్‌ వెంకట త్రివినాగ్‌ గురువారం తాటిపూడి జలాశయం వద్ద గ్రామంలో గిరిజనులను కలుసుకున్నారు. వారితో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వారి జీవన విధానాలను, జీవనోపాధుల గురించి అడిగి తెలుసుకున్నారు. గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.

➡️