గుంటూరు నగరంలో పోలీసు కవాతు

Mar 22,2024 23:38

ప్రజాశక్తి-గుంటూరుజిల్లా ప్రతినిధి : రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గుంటూరు నగరంలో పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం కేంద్ర పారామిలటరీ బలగాలతో స్థానిక పోలీసు అధికారులు కవాతు నిర్వహించారు. తూర్పు డివిజన్‌ ఎఎస్‌పి నిచికేట్‌ షెల్కి, అదనపు ఎస్‌పి శ్రీనివాసరావు, ఎఆర్‌ డిఎస్‌పి పి.శాంతకుమార్‌, ఆయా పోలీసు స్టేషన్లలోని సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక హిమనీ సెంటర్‌ నుండి పూల మార్కెట్‌ సెంటర్‌, లాంచెస్టర్‌ రోడ్‌, బారాఇమమ్‌ పంజా, బ్‌ీన్నూరు రోడ్‌, బోస్‌ బోమ్మ సెంటర్‌, నాజ్‌ సెంటర్‌ తదితర ప్రాంతాల్లో పోలీసు కవాతు చేశారు. ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలందరూ సహకరించాలని, అసాంఘిక శక్తులకు సహకరించవద్దని అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల సమాచారం అందించాలని ఎఎస్‌పి శ్రీనివాసరావు కోరారు. సిఐలు అన్వర్‌బాషా, రమేష్‌బాబుపాల్గొన్నారు.

➡️