గృహవసతి కల్పనే ధ్యేయం : కోలగట్ల

Mar 6,2024 20:59

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : అర్హులైన పేదలకు గృహ వసతి కల్పించడమే కాకుండా పూర్తి హక్కులను కూడా అందించడమే ప్రభుత్వ ధ్యేయమని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. బుధవారం 8, 12 డివిజన్ల పరిధిలోని ఇళ్లపట్టాల లబ్ధిదారులకు పూర్తి హక్కు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఫ్లోర్‌ లీడర్‌ ఎస్‌ వి వి రాజేష్‌ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేయడమే కాకుండా పూర్తి హక్కులను కూడా కల్పిస్తున్న ప్రభుత్వం తమదని అన్నారు. కార్యక్రమంలో మేయర్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ కోలగట్ల శ్రావణి, వైసీపీ నగర అధ్యక్షుడు ఆసపు వేణు, కమిషనర్‌ ఎం మల్లయ్య నాయుడు, ఆయా డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు.అభివృద్ధి పనులకు శంకుస్థాపననగరంలోని 28వ డివిజన్‌ రాజీవ్‌నగర్‌, పిఎస్‌ ఆర్‌ కాలనీలలో రూ.90 లక్షలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. రాజీవ్‌ నగర్‌ ఆర్చి నుండి ఆంజనేయస్వామి ఆలయం వరకు సిసి రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ నగరంలో ఇప్పటివరకు అభివద్ధిని చేసి చూపించామని, మరోసారి అవకాశం ఇస్తే సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. దాసన్నపేట వాటర్‌ ట్యాంక్‌ నుండి రాజీవ్‌ నగర్‌ కు పైప్‌ లైన్లు వేసి తాగునీటి సౌకర్యాన్ని కల్పించానన్నారు. గతుకల మయంగా ఉండే రహదారిని పునర్నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి మండలి డైరెక్టర్‌ బంగారు నాయుడు, స్థానిక కార్పొరేటర్‌ జాకీర్‌ హుస్సేన్‌, గణపతి తదితరులు పాల్గొన్నారు. సిసి రహదారులు ప్రారంభంనగరంలోని 38,43 డివిజన్ల పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన సిసి రహదారులను మేయర్‌ విజయలక్ష్మి ప్రారంభించారు. 38వ డివిజన్‌ బొబ్బాది పేటలో 9 లక్షల రూపాయలతోనూ, 43వ డివిజన్‌ ఉడా కాలనీలో 17.50 లక్షల రూపాయలతోనూ సిసి రోడ్లను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జోనల్‌ ఇన్చార్జి డాక్టర్‌ విఎస్‌ ప్రసాద్‌, స్థానిక కార్పొరేటర్లు తొగురోతు సంధ్యారాణి, దాసరి సత్యవతి, బొబ్బాది త్రినాధరావు, వంతరం సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️