గెలుపే లక్ష్యంగా పనిచేయాలి : టిడిపి

Dec 9,2023 20:51

 ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం  :  రానున్న ఎన్నికల్లో టిడిపి గెలిపే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఎన్నికల ప్రణాళిక కోసం చర్చించినట్లు కురుపాం నియోజకవర్గం టిడిపి ఇన్‌ఛార్జి తోయక జగదీశ్వరి తెలిపారు. అరుకు పార్లమెంట్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన కిడారి శ్రావణ్‌ ఆధ్వర్యంలో అరుకు పార్లమెంట్‌ పరిధిలో ఉన్న టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జిలతో విశాఖపట్నంలో సమావేశమైనట్లు ఆమె తెలిపారు. కురుపాం నియోజకవర్గంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తుందన్నారు. టిడిపికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు వివరించానని అన్నారు. అనంతరం కిడారి శ్రావణ్‌ ను ఇంచార్జిల తో కలిసి సన్మానించామని అన్నారు. ఈ సమావేశంలో టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు గుమ్మడి సంధ్యారాణి, ఉత్తరాంధ్ర జిల్లాల కో – ఆర్డినేటర్‌ దామిచెర్ల సత్య, ఎమ్మెల్సీ వి.చిరంజీవిరావు, పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, పాలకొండ, పార్వతీపురం నియోజకవర్గాల ఇన్చార్జులు నిమ్మక జయకృష్ణ, బోనెల విజయచంద్ర ఉన్నారు.

➡️