గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

Feb 5,2024 21:13

ప్రజాశక్తి- సీతంపేట : రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని క్లస్టర్‌ ఇంఛార్జిలు టిడిపి నియోజకవర్గ ఇంఛార్జి నిమ్మక జయకృష్ణ పిలుపునిచ్చారు. స్థానిక టిడిపి కార్యాలయంలో సోమవారం కెఎస్‌ఎస్‌లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జయకృష్ణ మాట్లాడుతూ క్లస్టర్‌ ఇంచార్జిలు, యూనిట్‌ ఇన్చార్జులు, ప్రతి ఒక కార్యకర్త సైనికుడిలా పనిచేయాలన్నారు. ఈ రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం అనివార్యమన్నారు. నియోజకవర్గాన్ని, వెనుకబడి ఉన్న సీతంపేటను అభివృద్ధి చేయాలంటే టిడిపి, జనసేన అధికారంలోకి రావాలన్నారు. ఈ సమావేశంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి కర్నేన అప్పల నాయుడు, సీతంపేట మండల ప్రధాన కార్యదర్శి బిడ్డిక అప్పారావు, క్లస్టర్‌ ఇంచార్జ్‌ నిమ్మక చంద్రశేఖర్‌, ఇమరక పవన్‌, బిడ్డిక సుబ్బారావు, బీసీ సెల్‌ అధ్యక్షులు ఆర్‌ రంగనాథం, ఎస్‌సి సెల్‌ అధ్యక్షులు గంట సుధా, మహాశక్తి ప్రచారకర్త తోయిక సంధ్యారాణి పాల్గొన్నారు. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం చేయాలిగ్రామ స్థాయిలో టిడిపిని బలోపేతం చేయాలని నారీశక్తి టిడిపి నాయకులు పడాల భూదేవి అన్నారు. తన నివాసంలో సోమవారం భామిని, సీతంపేట ముఖ్యనాయకులు, కార్యకర్తలతో ఆమె సమావేశం నిర్వహించారు. బూత్‌ లెవెల్‌లో ఓటర్‌ జాబితా వెరిఫికేషన్‌, ఇంటింటికి బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాల నిర్వహన మొదలైన అంశాల పై చర్చించారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు అంగూరు దసరధనాయుడు, సవర కుంపి, సవర గంగయ్య, సవర కూర్మారావు, సవర దేవా, సవర మంగయ్య, గొర్లె శ్రీరాములు, సవర సిమ్మయ్య, సవర మోహన్‌ పాల్‌, సవర బాలరాజు, ఆరిక మురళి, పువ్వల కైలాశ్‌, బి.ప్రసాద్‌, సవర సురేష్‌, గొర్లె నాగేశ్వరరావు, సుభాష్‌, అడ్డాయి, సింగ తదితరులు పాల్గొన్నారు.మండల అభ్యర్థులకే టిడిపి టికెట్‌సీతంపేట మండలానికి చెందిన అభ్యర్థులకే టిడిపి ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వాలని కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. సోమవారం పాలకొండ నియోజకవర్గం మహిళా అధ్యక్షులు బిడ్డక దమయంతి నాయుడు స్వగృహంలో విలేకరులతో టిడిపి నాయకులు మాట్లాడారు. సీతంపేటలో అధిక శాతం ఓటింగ్‌ ఉందని ఇక్కడున్న గిరిజనులు అధిక శాతం ఎటువైపు వేస్తే వాళ్లే గెలుస్తారని అన్నారు. మండలంలో ఉన్న నిజమైన గిరిజన అభ్యర్థులకే టిడిపి టిక్కెట్‌ ఇవ్వాలన్నారు. గతంలో సీతంపేట అభ్యర్థికి కాంగ్రెస్‌ టికెట్‌ ఇస్తే ఇక్కడ గిరిజనులు గెలిపించారని గుర్తు చేశారు. ఇప్పటికే సీతంపేటలో గిరిజన అభ్యర్థులు ఎక్కువగా చదువుకున్న వారు పోటీ చేయడానికి ఉత్సాహంతో ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపిలు ఆరిక లక్ష్మయ్య, సవరమాలయ్య, మాజీ జెడ్‌పిటిసి రాజబాబు, రాష్ట్ర ఎస్‌టి సెల్‌ కార్యదర్శి చందర్రావు, టిడిపి నాయకులు హెచ్‌ ప్రసాద్‌, మాజీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

➡️