గోడ పత్రికలు ఆవిష్కరణ

Mar 25,2024 21:50
ఫొటో : గోడపత్రికలు ఆవిష్కరిస్తున్న ఎంఎల్‌ఎ రామిరెడ్డి

ఫొటో : గోడపత్రికలు ఆవిష్కరిస్తున్న ఎంఎల్‌ఎ రామిరెడ్డి
గోడ పత్రికలు ఆవిష్కరణ
ప్రజాశక్తి-కావలి : కావలి నియోజకవర్గంలో మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మార్చి 28 నుంచి చెన్నాయిపాలెం పంచాయతీలోని నందిమ్మపురం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నట్లు ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. పట్టణంలోని ఎంఎల్‌ఎ నివాసంలో సోమవారం ఎన్నికల ప్రచార గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కావలి ఎంఎల్‌ఎ రామిరెడ్డి మాట్లాడుతూ 28వ తేదీ ఉదయం 9 గంటలకు చెన్నాయిపాలెం పంచాయతీ నందిమపురం నుంచి ఎన్నికల ప్రచార కార్యక్రమం మొదలు పెడుతున్నామని తెలిపారు. ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తున్న ప్రచార కార్యక్రమం నందిమ్మపురం నుంచి ప్రారంభించడం ఆనవాయితీగా జరుగుతుందన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో పార్లమెంట్‌ అభ్యర్థి విజయసాయిరెడ్డి పాల్గొంటారని తెలిపారు. నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు వైఎస్‌ఆర్‌ అభిమానులు విచ్చేసి, ఆశీర్వదించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

➡️