గ్రంథాలయాల పట్ల నిర్లక్ష్యం అన్యాయం

Jan 29,2024 21:10

ప్రజాశక్తి-బొబ్బిలి : విద్యార్థులు, యువతకు విజ్ఞానాన్ని అందించే గ్రంథాలయాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం అన్యాయమని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బేబినాయన అన్నారు. ప్రభుత్వ శాఖా గ్రంథాలయాన్ని బాగు చేయాలని కోరుతూ పట్టణంలోని ఎన్‌టిఆర్‌ బొమ్మ జంక్షన్‌ వద్ద జనసేన రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరి నిరాహార దీక్ష చేశారు. ఈ దీక్షకు బేబినాయన మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయ భవనాన్ని ప్రభుత్వం బాగు చేయకపోతే సొంత నిధులతో అభివృద్ధి చేస్తామన్నారు. బాబు పాలూరి మాట్లాడుతూ గ్రంథాలయ భవనాన్ని బాగు చేయాలని ఏడాది నుంచి ఆందోళన చేస్తే నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. దీక్షకు లోక్‌ సత్తా జిల్లా అధ్యక్షులు ఆకుల దామోదర్‌ మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు ఎస్‌.గంగాధర్‌, టిడిపి పట్టణ అధ్యక్షులు రాంబార్కి శరత్‌, సీనియర్‌ నాయకులు రౌతు రామమూర్తి, జనసైనికులు పాల్గొన్నారు.

➡️