గ్రామీణ భారత్‌ బంద్‌ను విజయంతానికి ప్రచారం

Feb 13,2024 21:13

ప్రజాశక్తి – కొమరాడ : ఈనెల 16న జరగనున్న గ్రామీణ భారత్‌ బంద్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వి. ఇందిర పిలుపునిచ్చారు. బంద్‌ విజయవంతం చేయాలని కోరుతూ మండలంలోని శివిని, విక్రాంపురం డంగభద్ర, కోనవలస, రాజ్యలక్ష్మిపురం, కొత్తకంభవలస, కందివలస, కుమ్మరిగుంట, స్వామినాయుడు వలస, జంఝావతి, గంగరేగివలస, కోటిపాం, కొమరాడ, గుమడ గ్రామాల్లో మంగళవారం ఆటో ప్రచారం చేపట్టారు. సంయుక్త కిసాన్‌ మోర్చా, కార్మిక సంఘాల జెఎసి ఉమ్మడిగా పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న గ్రామీణ భారత్‌ బంద్‌లో కార్మికులు, వ్యవసాయ కూలీలు, రైతులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ఉపేంద్ర, కొల్లి సాంబమూర్తి, హెచ్‌,రామారావు పలువురు రైతు, వ్యవసాయ కార్మిక, గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.బలిజిపేట: మండలంలోని నారాయణపురం, వెంగాపురం, పెదపెంకి, పెద్దింపేట, మిర్తివలస, తుమరాడలో ఈనెల 16న జరగబోయే దేశవ్యాప్తి గ్రామీణబంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ ప్రచార జాత నిర్వహించారు ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బంటు దాసు, గేదెల సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతూ, మరోవైపున కార్మిక, రైతు, ఉద్యోగులపై అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ బంద్‌ను చేపడుతున్నట్టు తెలిపారు. కావున మండలంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు వి.శంకరరావు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.పాలకొండ : గ్రామీణ భారత్‌బంద్‌ను జయప్రదం చేయాలని ఆటో కార్మికులు కరపత్రం ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా ఈనెల 16న గ్రామీణ భారత్‌బంద్‌లో కార్మికులంతా పాల్గొనాలని సిఐటియు పాలకొండ మండల సమన్వయ కమిటీ కన్వీనర్‌ కాద రాము పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆటో కార్మికులు దూసి దుర్గారావు, చిన్నారావు, అప్పారావు, సూర్యారావు, గోవింద, శ్రీను, సింహాచలం తదితరులు పాల్గొన్నారు.

➡️