ఘంటసాల పాటలు మరువలేనివి: తహశీల్దార్‌

ప్రజాశక్తి-దర్శి: మధుర గాయకుడు ఘంటసాల పాడిన పాటలు ప్రజలు గుండెల్లో చిరకాలంగా ఉండిపోతాయని స్థానిక తహశీల్దారు వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం పద్మశ్రీ ఘంటసాల కీర్తిశేషులు ఘంటసాల వెంకటేశ్వరరావు 102వ జయంతి వేడుకలు తహశీల్దారు కార్యాలయంలో జరిగాయి. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంఘ సేవకులు, జాతీయ అవార్డు గ్రహీత జీవీ రత్నం మాట్లాడుతూ మధుర గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు పాడిన పాటలు మరిచిపోలేనివని, అవి ప్రజలు ఉన్నంత వరకు ఉంటాయని అన్నారు. అంబేద్కర్‌ 67వ వర్థంతి సభ కరపత్రాలను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ నెల 6వ తేదీన ఎంపీడీఓ ఆఫీసులో అంబేద్కర్‌ విగ్రహం వద్ద జరిగే సభను జయప్రదం చేయాలని పలువురు కోరారు. ఈ కార్యక్రమంలో డీటీ రవిశంకర్‌, ప్రేమ్‌కుమార్‌, దేవప్రసాద్‌, మోషే, రవి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.ఘంటసాల చిత్రపటానికి పూలమాల వేస్తున్న తహశీల్దారు వెంకటేశ్వరరావు తదితరులు

➡️