ఘనంగా అంతర్జాతీయ దర్జీల దినోత్సవం

Feb 28,2024 21:18

ప్రజాశక్తి – రామభద్రపురం : అంతర్జాతీయ దర్జీల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆరికతోటలో టైలర్‌ సంఘం ప్రతినిధులు శీరాపు భాస్కరరావు, బొజ్జా నారాయణరావుల ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి ఆనందం వ్యక్తం చేశారు. సమాజంలో దర్జీలకు మంచి పేరు, ప్రతిష్టలు ఉన్నాయన్నారు. ఇటీవల రెడీ మేడ్‌ షాప్‌లు, ఆన్‌లైన్‌ వస్త్ర వ్యాపారాలు ఎక్కువ కావడంతో దర్జీల జీవితం దుర్భరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకొని బ్యాంకు రుణాలు, 50 ఏళ్లు దాటిన వారికి పెన్షన్లు మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గార నారాయణరావు, శ్రీను, కృష్ణ, చుట్టు పక్కల గ్రామాల దర్జీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.టైలర్స్‌ని ప్రభుత్వాలు ఆదుకోవాలిపూసపాటిరేగ: టైలర్స్‌ వృత్తిని నమ్ముకొని జీవితం గడుపుతునన్న తమను ప్రభుత్వాలు ఆదుకోవాలని పూసపాటిరేగ టైలర్స్‌ వర్కర్స్‌ సంక్షేమ సంఘ అధ్యక్షలు, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ లెంక సురేష్‌ అన్నారు. బుధవారం ప్రపంచ టైలర్స్‌ దినోత్సవం సందర్బంగా టైలర్‌ బవిరి రాంబాబు అధ్యక్షతన ఓ ప్రవేటు పంక్షన్‌ హాల్‌లో టైలర్స్‌ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా కుట్టుమిషన్‌ సృష్టికర్త విలియమ్స్‌ హావే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాలర్పించారు. ఈ సందర్బంగా సురేష్‌ మాట్లాడుతూ ప్రస్తుతం తమ వృత్తి తమ కడుపులు నింపలేకపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు గుర్తించి తమకు ఫించన్‌ రూపంలో, రుణాలు రూపంలో ఆర్ధికంగా ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టైలర్లు కానూరి బలరాం, అచ్చుత్‌రావు, సత్యా టైలర్‌, రాము, కిలారి రాంబాబు, కర్ని తౌడు, ఆలేటి శ్రీను, ఆంటోని మాస్టర్‌, రాజు, జి.సూరిబాబు, అనూరాద, రాజ్యలక్ష్మి, కనక మహాలక్ష్మి, కరుణ తదితర టైలర్స్‌ హజరయ్యారు.

➡️