ఘనంగా ఆర్ట్స్‌ కాలేజీ స్నాతకోత్సవం

ప్రజాశక్తి – కడప కడప ప్రభుత్వ పురుషుల కళాశాలలో బుధవారం రెండవ స్నాత కోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వైవీయూ విసి ఆచార్య చింతా సుధాకర్‌ చేతుల మీదుగా 2022-23 విద్యా సంవత్సరంలో డిగ్రీ చదివి ఉత్తీర్ణులైన 381 మంది విద్యార్థులకు గ్రాడ్యుయేషన్‌ పట్టా ప్రమాణం చేయించి, వారందరికీ డిగ్రీ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తమ కెరీర్‌పై దష్టి సారించాలని, ఉన్నత చదువులు చదివి ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాం క్షించారు. కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ డాక్టర్‌ పోలా భాస్కర్‌ విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. విద్యార్థులందరూ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని పోటీ ప్రపంచంలో కొత్త అవకాశాలను పొందా లన్నారు. ప్రభుత్వ పురుషుల కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ జి.రవీంద్రనాథ్‌రెడ్డి కళాశాల నివేదికను చదివి వినిపించారు. ఈ సంవత్సరం తమ కళాశాల విద్యార్థులు 30 మంది బంగారు పతకాలు సాధించినట్లు సాధించినట్లు తెలిపారు. కార్యక్రమంలో వైవీయూ రిజిస్టార్‌ ఆచార్య వెంకట సుబ్బయ్య, ఆర్‌జెడి డాక్టర్‌ నాగలింగారెడ్డి, డాక్టర్‌ బాబు, ఎజిఒ తులసి మస్తానయ్య, అధికారులు, కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️