ఘనంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వార్షికోత్సవం

ప్రజాశక్తి-కనిగిరి: స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల 54వ వార్షికోత్సవం, సీనియర్‌ విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్‌ పి రమణారెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకులు డాక్టర్‌ బాలకృష్ణ, పామూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సురేష్‌, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంజీవ్‌, జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి, రిటైర్డ్‌ బోటనీ లెక్చరర్‌ శేషబ్రహ్మం, కళాశాల తల్లిదండ్రుల కమిటీ అధ్యక్షులు నారాయణ పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులు చక్కని అలవాట్లను అలవర్చుకొని ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటి సాధనకు కృషి చేయాలని కోరారు. రాబోయే వార్షిక పరీక్షలకు చక్కగా ప్రిపేర్‌ అయ్యి కళాశాలకు మంచి ఫలితాలు తీసుకువచ్చి అధ్యాపకులకు, తల్లిదండ్రులకు మంచిపేరు తేవాలని అన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో టంగుటూరి గోవిందరావు, కళాశాల లెక్చరర్లు కాశింపీరా, రాజేంద్రబాబు, చెన్నకేశవులు, సురేష్‌, వెంకటరమణ ఉమా జయశ్రీ, రవీంద్ర, పద్మజా రామరాజు, సురేష్‌, నాగమణి గురవమ్మ, వెంకటరాజు, కోటి సాహెబ్‌, కోటేశ్వరరావు, మమత పాల్గొన్నారు.

➡️