ఘనంగా మాతృభాషా దినోత్సవం

Feb 21,2024 21:15

ప్రజాశక్తి-విజయనగరం కోట : అరతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని తోటపాలెంలోని ఎయిమ్‌ ఇంగ్లీషు మీడియం పాఠశాలలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా తెలుగుతల్లి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం విద్యార్థులు ‘మా తెలుగు తల్లికి మల్లె పూదండ’ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా పాఠశాల ఎఇ బాలాజీ, సురేష్‌ మాట్లాడు తూ ప్రపంచ భాషల్లోకి అద్భుతమైనది తెలుగు భాష అని కొనియాడారు. అనేక భాషలు తెలిసిన శ్రీకృష్ణ దేవరాయలు ‘దేశ భాషలందు తెలుగులెస్స’ అని కీర్తిం చారని పేర్కాన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యా యులు వైఎస్‌ నాయుడు, రమేష్‌, చక్రధర్‌, పాల్గొన్నారు. బొబ్బిలి: అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ సందర్భంగా కారుణ్య ఫౌండేషన్‌ అధ్యక్షులు, ఎపిటిఎఫ్‌ రాష్ట్ర అకడమిక్‌ కన్వీనర్‌ జెసి రాజు, ఫౌండేషన్‌ సభ్యులు డాక్టర్‌ బొంతు శ్రీరాములు, సిహెచ్‌జె ప్రవీణ్‌, కె. రామకృష్ణ, చిన్నారావులు తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేసి మాతృభాషను పరిరక్షించుకుందా మంటూ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం మాతృభాష పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ పాఠశాల ల్లో ఆంగ్ల భాషకు అధిక ప్రాముఖ్యత నిస్తూ మాతృభా షకు తగిన ప్రాధాన్యత లేకుండా నిర్లక్ష్య పూరితంగా వ్యవహరించటంతో తెలుగు భాష వినియోగం క్రమేపీ కోల్పోతున్నామన్నారు. ప్రభుత్వం, స్వచంద సేవాసం స్థలు, ఉపాద్యాయులు, భాషాభిమానులు, రచయితలు, భాషా పరిరక్షణకు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రంలో బ్లడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ ఈశ్వరరావు, యువత, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️