ఘనంగా వంగవీటి వర్థంతి

 

ప్రజాశక్తి- యంత్రాంగం

సింహాచలం: జివిఎంసి 98వ వార్డు పరిధి పైడితల్లమ్మ గుడి ప్రాంగణంలో ఉన్న వంగవీటి రంగా విగ్రహం వద్ద ఆయన వర్ధంతిని కాపు సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. వంగవీటి రంగా విగ్రహానికి భీమిలి నియోజకవర్గ జనసేన సమన్వయకర్త పంచకర్ల సందీప్‌ పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వంగవీటి రంగా ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని కోరారు. టిడిపి నాయకులు సతివాడ శంకరరావు మాట్లాడుతూ, వెనుకబడిన తరగతుల ప్రజలందర హృదయాల్లో వంగవీటి రచెరగని ముద్ర వేసుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మజ్జి సూరిబాబు, జనసేన, టిడిపి, కాపు సంఘ నాయకులు పాల్గొన్నారు వేపగుంట : జివిఎంసి 52వ వార్డు పరిధి శాంతినగర్‌లోని డిప్యూటీ మేయర్‌ క్యాంపు కార్యాలయంలో వంగవీటి రంగా చిత్రపటానికి డిప్యూటీ మేయర్‌ జియ్యాని శ్రీధర్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. రాజకీయాల్లో ముందుకు వెళ్లాలంటే వంగవీటి రంగాను ఆదర్శంగా తీసుకోవాలని శ్రీధర్‌ పేర్కొన్నారు.

➡️