చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి

Mar 20,2024 21:26

ప్రజాశక్తి – వంగర : చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాకారమవుతోందని మాజీ మంత్రి, టిడిపి రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీమోహన్‌ అన్నారు. బుధవారం మండలంలోని శివ్వాం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ ఉదయాన మురళీ కృష్ణారావుతో పాటు 300 వైసిపి కుటుంబాలు, ఓని అగ్రహారం గ్రామానికి చెందిన 50 వైసిపి కుటుంబాలు టిడిపిలో చేరాయి. వీరికి కోండ్రు పార్టీ కండువాలు వేసి ఆహ్వనించారు. వచ్చే ఎన్నికల శంఖారావంలో టిడిపికి అఖండమైన మెజారిటీని ఇచ్చి గెలిపించాలని కోండ్రు కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పిన్నింటి మోహన రావు, కిమిడి అశోక్‌ కుమార్‌, గురవాన నారాయణ రావు, బెజ్జి పురపు రవి, మజ్జి గణపతి, మజ్జి శ్రీనివాసరావు, దుప్పలపూడి శ్రీను, వల్లూరి గణేష్‌, వంగా వెంకటరావు, దూబ ధర్మారావు, జరజాన నీలయ్య తదితరులు పాల్గొన్నారు.అందరూ కలిసి గెలిపించాలిగంట్యాడ: రానున్న ఎన్నికలలో గజపతినగరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని టిడిపి,జనసేన,బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్‌ కోరారు. బుధవారం కొఠారిబిల్లి, నీలావతి గ్రామాలకు చెందిన కొంతమంది టిడిపి నాయకులు శ్రీనివాస్‌ను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రతి గ్రామంలో వివరించి రానున్న ఎన్నికలలో ఓట్లు వేయించడానికి ప్రయత్నం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.గెలిపిస్తే.. అభివృద్ధి చేస్తా : బేబినాయనబొబ్బిలి: రానున్న ఎన్నికల్లో తనను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్థి బేబినాయన అన్నారు. స్థానిక రాజా నగర్‌ కాలనీ, అమ్మిగారి కోనేరు గట్టుపై బుధవారం ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి సైకిల్‌ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. బేబినాయనకు మద్దతుగా ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే తెంటు రాజా, జనసేన ప్రచార కార్యదర్శి బాబు పాలూరి పాల్గొన్నారు. కార్యక్రమంలో టిడిపి కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, టిడిపి కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.టిడిపిలోకి వలసలుదత్తి రాజేరు: మరడాం గ్రామంలో వైసిపికి చెందిన 50 కుటుంబాలు బుధవారం టిడిపి తీర్థం పుచ్చుకున్నాయి. మాజీ సర్పంచ్‌ కర్రీ పైడమ్మ, మాజీ ఎంపిటిసి కర్రి అప్పల నాయుడు, సలాది గోపి, సురా బత్తుల సూర్యనారాయణ, కర్రి ఆదినారాయణ, వజ్జి అప్పలస్వామితో పాటు మరో 50 కుటుంబాలు టిడిపిలో చేరగా, పలువురు యువకులు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్‌, జనసేన నాయకులు, మాజీ మంత్రి పడాల అరుణ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

➡️