చీరాలలో మున్సిపల్‌ కార్మికుల నిరసన

ప్రజాశక్తి-చీరాల: మున్సిపల్‌ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయాలని కోరుతూ మున్సిపల్‌ కార్మికుల రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం 16వ రోజు చేరి ఈ సందర్భంగా చీరాలలో మున్సిపల్‌ కార్మికులు మానవహారం నిర్వహించి నిరసన తెలియజేశారు.ఈ సందర్భంగా సిఐటియు చీరాల పట్టణ అధ్యక్షులు ఎన్‌ బాబురావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్‌ కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా కార్మికులను రోడ్డుపై పడేసిందని అన్నారు. కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కనీస వేతనంపై స్పష్టత ఇవ్వకుండా ఇప్పటివరకు ప్రభుత్వం కార్మిక సంఘాలు తోటి ఐదు దపాలు చర్చలు జరిగినా కార్మికులకు ఏ ప్రయోజనాలు నెరవేరలేదని అన్నారు. సానుకూల నిర్ణయం రాకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కార్మిక సంఘాల నాయకులు ఎం రాజు, సింగయ్య, శంకర్‌, ఇమ్మానియేల్‌, కోటేశ్వరి, కుమారి, డొక్కా యోబు తదితరులు పాల్గొన్నారు.

➡️