జగనన్నకు లబ్ధిదారులే క్యాంపెయినర్లు

Feb 13,2024 21:52
ఫొటో : బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్న ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి

ఫొటో : బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్న ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి
జగనన్నకు లబ్ధిదారులే క్యాంపెయినర్లు
ప్రజాశక్తి-మర్రిపాడు : సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావించి రాష్ట్రంలో ప్రజలందరి కోసం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని మళ్లీ గెలిపించుకునేందుకు అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అందుకున్న లబ్ధిదారులు స్టార్‌ క్యాంపెయినర్లుగా మారి జగనన్నను మళ్లీ గెలిపించుకోవాలని ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి అన్నారు. ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి నిర్వహిస్తున్న విజయీభవయాత్ర మంగళవారం మండల కేంద్రమైన మర్రిపాడులో నిర్వహించారు. విజయీభవ యాత్రలో భాగంగా విక్రమ్‌ రెడ్డికి మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భారీస్థాయిలో బైక్‌ ర్యాలీగా మర్రిపాడు మండల కేంద్రానికి ఎంఎల్‌ఎను తీసుకొచ్చిన నాయకులు అక్కడి దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి స్థానిక ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ సాగిన ఎంఎల్‌ఎ మేకపాటి విజయీభవ యాత్ర మహిళలతో ముఖాముఖి మాట్లాడారు. మర్రిపాడులో నూతనంగా నిర్మించిన బస్‌ షెల్టర్‌ నిర్మాణాన్ని ప్రారంభించిన ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి రూ.35లక్షలతో నిర్మించిన సచివాలయ భవనం, రూ.20.80 లక్షలతో నిర్మాణం పూర్తి చేసుకున్న రైతు భరోసా కేంద్రం, రూ.17.67కోట్లతో నిర్మాణం పూర్తి చేసుకున్న విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌తో నిర్మింఛిన మిల్కింగ్‌ చిల్లింగ్‌ సెంటర్‌ నిర్మాణాలు పూర్తి కావడంతో ప్రారంభోత్సవాలు నిర్వహించారు. విజయీభవయాత్రలో ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌ రెడి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సంక్షేమ పాలనతో జనం గుండెల్లో జగనన్న గూడు కట్టుకున్నారని, ఆయన్ను ఎదుర్కొనేందుకు రాష్ట్రంలోనే అన్ని పార్టీలు జతకట్టాయని, కుట్రలు, కుతంత్రాలు, ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారని, అలాంటి వారి మాటలను నమ్మవద్దన్నారు. 175స్థానాల్లోనూ వైసిపి జెండాను రెపరెపలాడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజల సంక్షేమం కోసం జగనన్న 124సార్లు బటన్‌ నొక్కారని, జగన్నన కోసం వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుపై బటన్‌ నొక్కాలని ప్రజలను కోరుతున్నామన్నారు. మర్రిపాడు పంచాయతీకి ఇప్పటి వరకు గడపగడపకు మన ప్రభుత్వం ద్వారా రూ.40లక్షలు అభివృద్ధి పనుల కింద అందచేసినట్లు వివరించారు. నవరత్నాల సంక్షేమ పథకాల ద్వారా రూ.15.68కోట్లను అందజేశారని, వీటిలో నేరుగా లబ్ధిదారుల ఖాతాకు రూ.11.27కోట్లు, నాన్‌ డిబిటి ద్వారా రూ.4.38కోట్లు అందజేశామన్నారు. మర్రిపాడుకు వైఎస్‌ఆర్‌ జలకళ పథకం ద్వారా ఇప్పటి వరకు 26 బోర్లకు రూ.10లక్షలు అందజేసినట్లు, ఎన్‌ఆర్‌జిఎస్‌ ద్వారా రూ.1.28 కోట్లు అందజేశామని, ఎంపి నిధుల కింద రూ.5 లక్షలతో అభివృద్ధి పనలు నిర్వహించినట్లు తెలిపారు. జగనన్న లే అవుట్ల ద్వారా 49మంది, సొంత స్థలం కలిగిన వారికి 8మంది లబ్ధి చేకూరినట్లు వివరించారు. విద్యాభివృద్ధి కోసం జగనన్న 25మంది వ్యిద్యార్థులకు ట్యాబ్‌లు అందజేశామన్నారు. అనంతరం గడపగడపకు మన ప్రభుత్వం, ఎన్‌ఆర్‌జిఎస్‌ ద్వారా మంజూరైన రూ.70లక్షల అభివృద్ధి పనులకు శంఖుస్థాపన కార్యక్రమాను నిర్వహించారు. మండల కన్వీనర్‌ సుబ్బిరెడ్డి, ఎంపిపి గంగవరపు లక్ష్మీదేవి, మాజీ కన్వీనర్‌ శ్రీనివాసులు నాయుడు, జెసిఎస్‌ మండల కన్వీనర్‌ సిద్ధంరెడ్డి మోహన్‌ రెడ్డి, భీమవరం బూదవాడ సొసైటీ చైర్మన్‌ సోమల మాధవరెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్‌ శ్రీధర్‌ రెడ్డి, జిల్లా మైనారిటీ విభాగం సెక్రటరీ షేక్‌ మౌలాలి, జిల్లా రైతు విభాగం సెక్రటరీ గంగినేని రవీంద్రబాబు, సేవాదళ్‌ సెక్రటరీ నారాయణస్వామి, సర్పంచులు సత్యం, గాలిపోయిన రామ్మోహన్‌, నరసింహారావు, కృష్ణారెడ్డి, యువజన విభాగం జిల్లా సెక్రెటరీ ప్రతాపరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️