జరజాపుపేట శ్మశాన వాటికలో దొంగతనం

Mar 19,2024 21:11

ప్రజాశక్తి – నెల్లిమర్ల: జరజాపుపేట శ్మశాన వాటికలో మంగళవారం దొంగతనం జరిగింది. కొంత మంది శ్మశానంలో బీడుతో కూడిన దహన వాటికను ద్వంసం చేసి పట్టుకెళ్తున్న సమయంలో ఎవరో కేకలు వేయడంతో దహన వాటిక శిధిలాలను అక్కడే వదిలి దుండగులు పలాయనం చిత్తగించారు. కాగా ఇటీవల శ్మశానం అభివృధి చేయడానికి దాతలు ముందుకు వచ్చి లక్షలాది రూపాయలతో ప్రహరీగోడ, దహన వాటిక ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో దుండగులు బీడు దహన వాటిక లక్షలు విలువ చేయడంతో దాని మీద కన్నేశారు. మంగళవారం ఉదయం దహన వాటికను ముక్కలు చేసి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా పొలం పనులకు వెళ్ళే వారికి శబ్దాలు వినిపించడంతో పెద్ద కేకలు వేశారు. దీంతో దుండగలు వాటిని అక్కడే వదిలేసి పారిపోయారు. కాగా ఇంటిలో దొంగ తనం చేయడం చూసాం, గాని శ్మశాన వాటికలో దొంగతనం చేయడం ఏమిటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్మశాన వాటికలో దొంగతనం పై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని గ్రామస్తులు చెబుతున్నారు.

➡️