జిల్లా వ్యాప్తంగా నిరసనలు

Feb 16,2024 21:42

 ప్రజాశక్తి-గజపతినగరం : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా రైతు సంఘాల సమన్వయ సమితి, కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన గ్రామీణ భారత్‌ బంద్‌, కార్మిక సమ్మె జిల్లాలో విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా పలు సంఘాల ఆధ్వర్యాన స్థానిక ఆర్‌టిసి కాంప్లెక్సు నుంచి సూర్యమహాల్‌ బ్రిడ్జి వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ రాస్తారోకో చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి వి.లక్ష్మి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జి.శ్రీనివాస్‌, వ్యకాస (బికెఎంయు) జిల్లా కార్యదర్శి పురంఅప్పారావు, ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి హరికృష్ణవేణి, రైతు సంఘం నాయకులు దాసరి సింహాద్రి, సిఐటియు నాయకులు కృష్ణ, నూకరాజు పాల్గొన్నారు.

రామభద్రపురం : మండల కేంద్రంలోని ఆర్‌టిసి కాంప్లెక్స్‌ వద్ద సిఐటియు ఆధ్వర్యాన రాస్తారోకో చేపట్టారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.శంకరరావు, నాయకులు బలసా శ్రీను, ఆటో యూనియన్‌ అధ్యక్షులు చొక్కాపు లోకేష్‌, ఉపాధ్యక్షులు సంజీవరావు, నాయకులు వెంకట్రావు, రామకృష్ణ పాల్గొన్నారు.

శృంగవరపుకోట : పట్టణంలోని ఆర్‌టిసి కాంప్లెక్స్‌ నుంచి దేవి బొమ్మ కూడలి వరకు సిఐటియు, ఎఐటియుసి, రైతు సంఘం ఆధ్వర్యంలో చేపట్టారు. అనంతరం మనవహారం నిర్వహించి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర నాయకులు కామేశ్వరరావు, ఎపి రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చల్లా జగన్‌, సిఐటియు జిల్లా నాయకులు చెలికాని ముత్యాలు, ఎఐటియుసి నాయకులు మద్ది కృష్ణ, నాయకులు స్వామి, మధు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఎం.హర్ష, తదితరులు పాల్గొన్నారు.

బొబ్బిలి : గ్రామీణ బంద్‌కు మద్దతుగా బొబ్బిలిలో పట్టణ కళాసీ సంఘం, సిఐటియు, ఎఐటియుసి, రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కళాసీ సంఘం కార్యాలయం వద్ద ర్యాలీ ప్రారంభించి చర్చి సెంటర్‌, బజారు మీదుగా ఎన్‌టిఆర్‌ విగ్రహ కూడలి వరకు నిర్వహించి, అనంతరం మానవహారం చేశారు. కార్యక్రమంలో పట్టణ కళాసీ సంఘం కార్యదర్శి డి.వర్మ, సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.శంకరరావు, ఎఐటియుసి జిల్లా నాయకులు శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

నెల్లిమర్ల : సిఐటియు, ఎఐటియుసి, ఐఎన్‌టియుసి నాయకులు కిల్లంపల్లి రామారావు, మొయిద పాపారావు, కనకల పద్మనాభం ఆధ్వర్యాన స్థానిక మొయిద జంక్షన్‌ వద్ద రాస్తారోకో చేపట్టారు. కార్యక్రమంలో జె.సత్యారావు, ఎం.సన్యాసిరావు, తదితరులు పాల్గొన్నారు.కొత్తవలస : సిఐటియు, ఎపి రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కొత్తవలస జంక్షన్‌లో రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గాడి అప్పారావు, నాయకులు పాల్గొన్నారు.

➡️