జెకెసి ట్రస్టు ఆధ్వర్యాన నిత్యావసరాలు పంపిణీ

నిత్యావసర సరుకులు అందిస్తున్న జమాల్‌ఖాన్‌ తదితరులు

ప్రజాశక్తి – ఎటపాక :

రంజాన్‌ మాసం సందర్భంగా పేదలు మధ్యతరగతి ముస్లిం కుటుంబాలు, శ్రామికులకు జమాల్‌ ఖాన్‌ చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యాన నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఎటపాక మండలం నెల్లిపాకలో 35 కుటుంబాలు, గన్నవరంలో 15 కుటుంబాలు, కూనవరం మండలం పోచవరంలో 28 కుటుంబాలు, మొత్తం 78 కుటుంబాలకు, ఒక్కో కుటుంబానికి 10 కేజీలు బియ్యం, కేజీ పంచదార, లీటర్‌ మంచి నూనె, కేజీ కందిపప్ప, ఉప్పు, కారం తదితర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆయుర్వేద వైద్యులు జమాల్‌ ఖాన్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమకున్న సంపదలో ఎంతో కొంత ఇతరులకు దానం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జమాల్‌ ఖాన్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఇంచార్జ్‌ సయ్యద్‌ సుభహాని, గ్రామ పెద్దలు ఇమామ్‌, సాబీర్‌ బాష, అబ్రార్‌ ఖాన్‌, సిబ్బంది అజీజ్‌, సమీర్‌, ఎస్‌కె షాజహాన్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️