టిడిపితోనే మహిళలకు గుర్తింపు

Mar 12,2024 21:26

ప్రజాశక్తి-విజయనగరం కోట  : టిడిపి ని స్థాపించిన తరువాతే రాష్ట్రంలో మహిళలకు గుర్తింపు వచ్చిందని మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ ప్రసాదుల కనక మహాలక్ష్మి అన్నారు. టిడిపి అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి సూచన మేరకు తెలుగు మహిళా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మంగళవారం 5వ, 6వ 7వ డివిజన్‌లకు సంబంధించి దాసన్నపేటలో ప్రసాదుల కనకమహాలక్ష్మి ఇంటి వద్ద ‘డ్వాక్రా సంఘాల మహిళలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టిడిపి హయాంలోనే మహిళలకు ఆస్తిలో సమానహక్కు, చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌ కల్పించారన్నారు. ఇటీవల అంతర్జాతీయ మహిళా టిడిపి, జనసేన ఉమ్మడిగా ప్రకటించిన ‘కలలకు రెక్కలు’ అనే పథకం గురించి వివరించారు.కార్యక్రమంలో తెలుగు మహిళా నాయకులు సువ్వారి అనురాధ బేగం, పత్తిగిల్లి సూర్యకుమారి, కంది శమంతకమణి, చింతల వీరలక్ష్మి, రౌతుపద్మ, పద్మలత, సియ్యాదుల ఝాన్సీ, వెలిచేటి మణికుమారి, పి.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.పెన్షన్‌ దారులకు అండగా ఉంటాంఅలకానంద కాలనీ తోష్నివాల్‌ వాకర్స్‌ క్లబ్‌ సభ్యులతో టిడిపి అభ్యర్థి పి.అదితి విజయలక్ష్మి సమావేశమయ్యారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అధోగతి పాలయిందన్నారు, ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లలకు జీతాలు సరిగ్గా అందటం లేదన్నారు, ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. అదితి విజయలక్ష్మిని గెలిపించాలని కోరుతూ ఎస్‌సి సెల్‌ నాయకులు 12వ డివిజన్‌లో ఇంటింటి ప్రచారం చేశారు. నియోజకవర్గ అధ్యక్షులు గొండేల ప్రకాష్‌, ప్రధాన కార్యదర్శి శంకర్రావు దేవరపల్లి తదితరులు పాల్గొన్నారు.

➡️