టిడిపిని ఆదరించండి : ఇంటూరి

Feb 26,2024 19:43
టిడిపిని ఆదరించండి : ఇంటూరి ప్రచారం

ప్రచారం నిర్వహిస్తున్న ఇంటూరి నాగేశ్వరరావు
టిడిపిని ఆదరించండి : ఇంటూరి
ప్రజాశక్తి-కందుకూరు : కందుకూరు పట్టణంలోని 32 వార్డులో మూడోరోజు బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి కందుకూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు కరపత్రాలు పంపిణీ చేశారు. నాగేశ్వరరావు, పార్టీ నాయకులు సాయినగర్‌ 7, 8 లైన్లలో గడప గడపకు తిరుగుతూ సూపర్‌ సిక్స్‌ పథకాలను వివరించారు. రాజధాని అమరావతి విషయంలో జగన్‌ చేసిన మోసాన్ని ప్రజలు గుర్తు చేసుకోవాలని నాగేశ్వరరావు కోరారు. సంపూర్ణ మద్యపాన నిషేధం, ప్రతి ఏటా జాబ్‌ క్యాలెండర్‌, మెగా డిఎస్‌సి లాంటి హామీలు అమలు చేయకుండా ప్రజలకు తీరని అన్యాయం చేశారన్నారు. పట్టణ పార్టీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి ముచ్చు శీను, వార్డు అధ్యక్షుడు ముప్పవరపు వేణు, వార్డు నాయకులు ఉన్నం వీరాస్వామి, డబ్బుగోట్టు మల్లికార్జున, దామా వెంకటేశ్వర్లు, మెట్ల అశోక్‌ బాబు, పువ్వాడి రమేష్‌, చుండూరి మాల్యాద్రి, చల్లా మహేంద్ర, కొమర రమణయ్య, ఓరుగంటి రామ్మూర్తి, వీర వెంకట్రావు, బత్తిన అదేమ్మ, చుంచు వేణు, తుమాటి రవి, రావి సరిత, నాయకులు గోచిపాతల మోషే, చిలకపాటి మధుబాబు, రెబ్బవరపు మాల్యాద్రి ఉన్నారు.

➡️