టిడిపిలో భారీ చేరికలు

Feb 25,2024 21:41

ప్రజాశక్తి – బలిజిపేట: మండలంలోని బర్లిలో ఆదివారం వైసిపి నుండి టిడిపిలోకి పెద్దసంఖ్యలో చేరికలు జరిగాయి. గ్రామానికి చెందిన ఎగిరెడ్డి నారాయణ రావు (నాని) అధ్యక్షతన ఆ గ్రామ సర్పంచ్‌ గులిపల్లి అప్పల నాయుడుతో పాటు సుమారు వంద కుటుంబాలు, అజ్జాడలో వైసిపి నాయకులు అక్కేన యల్లన్నాయుడు, ఇతర కుటుంబాలు బొబ్బిలి టిడిపి అభ్యర్థి బేబీనాయన, పార్వతీపురం టిడిపి అభ్యర్థి బోనెల విజయ చంద్ర సమక్షంలో ఆదివారం చేరారు. ఈ సందర్భంగా బేబీ నాయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ఖూనీ చేసిన ప్రభుత్వం నుంచి బయటకు రావడం. టిడిపిలో చేరడం మంచిదన్నారు. భారీగా చేర్పులు జరగడం వైసిపి అసమర్థత అని అన్నారు. టిడిపి, జనసేన నాయకులు ఐక్యమై ఎమ్మెల్యేగా విజయచంద్రను గెలిపించాలని, తనను కూడా ప్రజల సహకారంతో బొబ్బిలి నుండి గెలిపించాలని కోరారు. అనంతరం విజయచంద్ర మాట్లాడుతూ బర్లి గ్రామానికి జరిగిన అవమానానికి రెండింతలు తీరుస్తానని అన్నారు. పాముకి కోరల్లో విషముంటే ఎమ్మెల్యే జోగారావుకు ఒళ్లంతా ఉందని ఆరోపించారు. బర్లిలో పిహెచ్‌సి ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జనసేన నాయకులు బాబు పాలూరు. టిడిపి మండల అధ్యక్షులు పి.వేణుగోపాలనాయుడు, నాయకులు వెంకటనాయుడు, క్లస్టర్‌ ఇన్‌ఛార్జ్‌ బాబ్జీ, రాంబాబు, తదితరలు పాల్గొన్నారు70 కుటుంబాలు టిడిపిలో చేరిక సీతంపేట:మండలంలోని కెపి ఈతమానుగూడకు చెందిన సవర చంద్రయ్య, సవర మంగయ్య, సవర కూర్మారావు, సవర చిన్నారావు, సవర ఈశ్వరరావు, సవర గోపాలరావు, సవర మంగయ్య, సవర మజ్జయ్య, సవర చంద్రమ్మ, సవర సుశీల, సవర బంగారమ్మ చెందిన 70 కుటుంబాల నాయకులు, కార్యకర్తలు టిడిపి పాలకొండ నియోజకవర్గం నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరిని తెలుగుదేశం పార్టీ కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సవరతోట మొఖలింగం, సీనియర్‌ నాయకులు నిమ్మక నాగేశ్వరరావు, పాలక ఆదినారాయణ, ఐటిడిపి కోఆర్డినేటర్‌ ఈమరక పవన్‌, తెలుగు యువత అధ్యక్షులు సవర సంతోష్‌, క్లస్టర్‌ ఇన్‌ఛార్జ్‌ నిమ్మక చంద్రశేఖర్‌, సింహాద్రి, మండల నాయకులు పాల్గొన్నారు.

➡️