టిడ్కో ఇళ్ల పట్టాల పంపిణీ

Mar 9,2024 21:11

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి చేతుల మీదుగా టిడ్కో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. సారిపల్లిలో నాలుగో దశలో 1024 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఇప్పటివరకు సారిపల్లెలో నాలుగు దశలలో మొత్తం 2656 ఇంటి పట్టాలను లబ్ధిదారులకు అందించారు. పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ ఎండాకాలంలో ఎప్పుడు కూడా ప్రజలకు మంచినీటి సమస్యలు లేకుండా చేశామని అన్నారు. ఒక సామాన్య వ్యక్తి ఎమ్మెల్యే అయితే విజయనగరాన్ని ఇంత అభివద్ధి చేసి చూపించాను, మరొకసారి అవకాశం ఇస్తే సమస్యలు లేని విజయనగరంగా తీర్చిదిద్దుతానని అన్నారు. టీడ్కో ఇంటి పట్టాలు పంపిణీ సమయంలో ఏ ఒక్కరూ లబ్ధిదారుడు రూపాయి లంచం ఇవ్వలేదని, అధికారులు సైతం లంచం తీసుకోకుండా చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి చెందుతుందని అన్నారు. కార్యక్రమంలో మేయర్‌ విజయలక్ష్మి, కమిషనర్‌ ఎంఎం నాయుడు, నగర మేయర్‌ డిప్యూటీ మేయర్లు, పట్టణ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. సిఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు పంపిణీఅనారోగ్యానికి గురై ఆపరేషన్‌ చేయించుకోలేక ఇబ్బంది పడుతున్న పేదలకు సిఎం రిలీఫ్‌ ఫండ్‌ను డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి శనివారం అందజేశారు. సిఎం రిలీఫ్‌ ఫండ్‌ నుండి సుమారు 7 లక్షల 81 వేల రూపాయలు అందజేశారు.

➡️