ట్రాఫిక్‌ కష్టాలు తీరేదెప్పుడో..!

ప్రజాశక్తి – ఎర్రగుంట్ల ఎర్రగుంట్ల నగర పంచాయతీలో ట్రాఫిక్‌ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. మండల కేంద్రం కావడం, అందులోనూ జాతీయ రహదారి కావడంతో నిత్యం వాహనాల రద్దీ అధి కంగా ఉంటుంది. ప్రధాన రహదారుల వెంబడి ద్విచక్ర వాహనాలు నిలవడం, చిరు వ్యాపారులు తోపుడుబండ్లపై రోడ్డుపైనే తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఇది ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తోంది. పెరుగుతున్న వాహనాలకు సరిపడ పార్కింగ్‌ స్థలాలు లేకపోవడమే ఈ సమస్యకు ప్రధాన కారణం. వాహనదారులు ఎక్కడపడితే అక్కడ నిలిపి ట్రాఫిక్‌ సమస్యను జఠిలం చేసు ్తన్నారు. సమస్యపై అటు పోలీసులు ఇటు మున్సి పల్‌ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ప్రజ లు ఆరోపిస్తున్నారు. అడపాదడపా రోడ్డుకు ఆను కొని పార్కింగ్‌ చేసిన వాహనాలకు నో పార్కింగ్‌ చలానాలు పోలీసులు వేస్తున్నారు. కానీ పట్టణంలో ఎక్కడ కూడా నో పార్కింగ్‌ సైన్‌ బోర్డులు మాత్రం కనిపించడం లేదు. నో పార్కింగ్‌ బోర్డులు లేకపో యినా నో పార్కింగ్‌ చలానాలు పోలీసులు విధిస్తున్నారని, పార్కింగ్‌ స్థలాన్ని ఏర్పాటుచేయాలంటూ స్థానికులు వాపోతున్నారు. వేంపల్లి రోడ్డు, ముద్దనూరు రోడ్డులో పాదాచారులు నడుచుటకు వీలుగా ఫుట్‌ పాత్‌లు ఉన్నప్పటికీ దానిపై దుకాణా దారులు బోర్డులు ఏర్పాటు చేసుకోవడంతో ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీనికి తోడు ఫుట్‌పాత్‌ల ముందు ద్విచక్ర వాహ నాల పార్కింగ్‌ చేయడంతో పాదాచారులు రోడు ్డపైన నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పాదా చారులు, వాహనదారులు ప్రమాదాలకు గురవు తున్నారు. పట్టణ పరిధిలో గత 15 రోజుల వ్యవధిలో ఏడు ప్రమాదాలు జరిగాయి. అందులో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇన్ని ప్రమాదాలు, ఇంతమంది మరణిస్తున్నా ఏమీ పట్ట నట్లు పోలీసులు, మున్సిపల్‌ అధికారులు వ్యవహ రిస్తుండడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తు న్నారు. పట్టణ ప్రణాళిక అధికారులు ఫుట్‌పా త్‌లు, ఆక్రమిత స్థలాలు వంటి పలు సమ స్యలను గాలికి వదిలేశారని స్థానికులు ఆరోప ిస్తున్నారు. పోలీసులు, పట్టణ ప్రణాళిక అధికా రులు కలిసి కట్టుగా పనిచేసి ట్రాఫిక్‌కు, ప్రమా దాలకు ప్రధా న కారణమైన పార్కింగ్‌ సమస్యను తొలగించి పార్కింగ్‌ స్థలాన్ని ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే ఫుట్‌పాత్‌లపై ఉన్న దుకాణాల బోర్డులను తొలగించి పాదా చారులు నడిచేలా చర్యలు తీసు కోవాలని పోలీ సులు, పట్టణ ప్రణాళిక అధికారులను కోరుతున్నారు. ఫుట్‌పాత్‌లపై బోర్డులు తొలగించకపోతే చర్యలు ట్రాఫిక్‌ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ట్రాఫిక్‌ సిగల్స్‌ కూడా ఏర్పాటు చేయుటకు మున్సిపల్‌ కమిషనర్‌తో చర్చించాం. ఫుట్‌ పాత్‌లపై దుకాణదారులు బోర్డులు తొల గించకపోతే చర్యలు తీసుకుంటాం. వాహనాల సంఖ్య పెరగడంతో కొంతమేర పార్కింగ్‌ సమస్య ఉన్నా కూడా రోడ్లపై ఎక్కడపడితే అక్కడ వాహ నాలు నిలపకుండా ఎప్పటికప్పుడు పోలీసులు చర్యలు తీసుకుం టున్నారు. వాహనదారులు పార్కింగ్‌ నిబంధనలు తప్పక పాటించాలి. ప్రజలు కూడా ట్రాఫిక్‌కు సమస్య లేకుండా పోలీసులకు సహకరించాలి.- ఈశ్వరయ్య, సిఐ, ఎర్రగుంట్లత్వరలో ట్రాఫిక్‌ సిగల్స్‌ ఏర్పాటు చేస్తాం.. ట్రాఫిక్‌ సిగల్స్‌ ఏర్పాటు చేయుటకు ప్రయత్నం చేస్తున్నాం. పట్టణ ప్రణాళిక అధికారులు పోలీసుల సహకారంతో పది రోజుల్లో ఫుట్‌ పాత్‌లపై ఉన్న బోర్డులను తొలగించేలా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ స్థలం లేక పోవడంతో పార్కింగ్‌ సమస్యను తీర్చలేకున్నాం. వేంపల్లి రోడ్డు ప్రధాన రహదారి మధ్యలో కొద్దిమేర పార్కింగ్‌ స్థలాన్ని ఏర్పాటు చేశాం.- పగడాల జగన్నాథ్‌, మున్సిపల్‌ కమిషనర్‌

➡️