డిమాండ్లను అంగీకరించే వరకూ సమ్మె

ప్రజాశక్తి – క్రోసూరు : ఇంటి తాళాలు పగలగొట్టిన వారిని దొంగలంటారని, ప్రభుత్వం తన కార్యాలయాల తాళాలను తానే పగలకొట్టుకోవడాన్ని ఏమం టారో రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞతకే వదిలేస్తున్నామని సిఐటియు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఆంజనేయనాయక్‌ అన్నారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్‌ సెంటర్‌ వద్ద బస్టాండ్‌లో సమ్మె శిబిరాన్ని ఆంజనేయ నాయక్‌ శనివారం సందర్శించి మాట్లాడారు. తెలంగాణ కంటే జీతం రూ.వెయ్యి అదనంగా ఇస్తానని ఇచ్చిన హామీని జగన్‌మోహన్‌రెడ్డి గుర్తు తెచ్చుకోవాలన్నారు. అంగన్వాడీలు ఎన్నో పోరాటాలు చేసి తమ సమస్యలను పరిష్కరించుకున్నారని, ఎన్నో ప్రభుత్వాల మెడలు వంచారని అన్నారు. ఇప్పటికైనా సానుకూలంగా స్పందించకుంటే వైసిపి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అనంతరం సిఐటియు బెల్లంకొండ మండల కార్యదర్శి పుల్లారావు మాట్లాడారు. యుటిఎఫ్‌ నాయకులు ప్రకాష్‌ మాట్లాడుతూ సిపిఎస్‌ విషయంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులను ఎలా మోసం చేశారో అంగన్వాడీలనూ అదేవిధంగా ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. అంగన్వాడీలు రాజీ పడకుండా పోరాడాలని, తమ పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు. ఇదిలా ఉండగా అంగన్వాడీలు సమ్మె శిబిరంలో కళ్లకు గంతలతో నిరసన తెలిపారు.

ప్రజాశక్తి – చిలకలూరిపేట : స్థానిక ఎన్‌ఆర్‌టి సెంటర్‌లోని సమ్మె శిబిరాన్ని వివిధ సంఘాల నాయకులు సందర్శించి అంగన్వాడీలకు తమ సంఘీభావాన్ని, మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా ఆవాజ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎంఎ.చిష్టి మాట్లాడుతూ పాలకుల మెడలు వంచి డిమాండ్లను అంగీకరించే వరకూ అలుపెరుగని ఉద్యమం చేయాలన్నారు. అందుకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించి అంగన్వాడీలను ఉత్సాహ పరిచేలా పాటలు పాడారు. కౌలురైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.రాధాకృష్ణ మాట్లా డుతూ అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొ ట్టినంత మాత్రన భయపడి విధుల్లోకి వెళ్లేవారు ఎవరూ లేరని, సమ్మె కొనసాగి తీరుతుందని చెప్పారు. అంగన్వాడీల పోరాటానికి తాము పూర్తి మద్దతుగా ఉంటామన్నారు. జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తోట రాజారమేష్‌ మాట్లాడుతూ తమ సంఘీభావాన్ని ప్రకటిం చారు. అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) సెక్టార్‌ అధ్యక్షులు జి.సావిత్రి మాట్లాడుతూ తాము ఐదు రోజుల నుండి సమ్మె చేస్తున్నా ఈ విషయం సిఎం జగన్‌మోహన్‌రెడ్డికి తెలియదనడం ప్రభుత్వ పాలనా తీరుకు నిదర్శనమని మండిపడ్డారు. మద్దతు తెలిపిన వారిలో వివిధ సంఘాల నాయకులు షేక్‌ సుభాని, బ్రహ్మస్వాములు, పి.బాషా, పి.సుమలత, ప్రసన్న, సుభాని, పి.వెంకటేశ్వర్లు, ఎం.విల్సన్‌, ఎస్‌.బాబు ఉన్నారు. ఈ సంద ర్భంగా అంగన్వాడీలు నల్ల బ్యాడ్జీలు ధరించి మున్సిపల్‌ కార్యాలయం వరకు మౌన ప్రదర్శన చేశారు. మున్సిపల్‌ మేనేజర్‌ నగినా సుల్తానాకు వినతిపత్రం ఇచ్చారు. అంగన్వాడీ నాయకులు కె.రమాదేవి, శారదా, పద్మ, పరిమళ పాల్గొన్నారు.

ప్రజాశక్తి – వినుకొండ : పట్టణంలోని సురేష్‌ మహల్‌ రోడ్డులో అంగన్వాడీల సమ్మె శిబిరం కొనసాగింది. ఈ సందర్భంగా అక్కడే వంటావార్పు చేశారు. వీరికి మద్దతుగా సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్‌ మాట్లాడుతూ సమ్మె ప్రాథమిక హక్కని, అయితే ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు బెదిరింపులకు పాల్పడడం సిగ్గు చేటని విమర్శించారు. పలు దఫాలుగా చర్చలు సఫలం కాని నేపథ్యంలోనే అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారనే పాలకులు గమనించాలని కోరారు. అంగన్వాడీలు అడుగుతున్నది గతంలో జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీల అమలునేనని చెప్పారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం రూ.26 వేలు, పెన్షన్‌ అమలు చేయాలని, ఉద్యోగ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచాలని, గ్రాట్యుటీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ అంశాలపై అంగన్వాడీలు చేస్తున్న పోరాటానికి సిపిఐ, సిపిఎం, ఎఐటియుసి, సిఐటియు, ఇతర రాజకీయ పార్టీలు, సంఘాల అండ ఉంటుందని, సమస్యలు పరిష్కారం అయ్యే వరకూ ఐక్యంగా పట్టుదలతో పోరాడాలని పిలుపునిచ్చారు. బెదిరిఒపులకు ఎవరూ లొంగొద్దన్నారు. మద్దతు తెలిపిన వారిలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బి.శ్రీనివాసరావు, రైతు సంఘం నాయకులు యు.రాముు సిఐటియు పల్నాడు జిల్లా అధ్యక్షులు కె.హనుమంతరెడ్డి, నాయకులు ఎ.ఆంజనేయులు, సిపిఎం పట్టణ కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు, శివరామకృష్ణ, లక్ష్మీ ప్రసన్న, ఎఐటియుసి నాయకులు ఆర్‌.వందనం, కె.మల్లికార్జున, శారమ్మ, టిడిపి నాయకులు ఎం.హనుమంతరావు ఉన్నారు.

ప్రజాశక్తి-అచ్చంపేట : సమ్మెలో భాగంగా అంగన్వాడీలు స్థానిక మహాత్మా గాంధీ, అంబేద్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలిచ్చారు. ఎంపిడిఒ కార్యాలయం ఎదుట బైటాయించి నిరసన తెలిపారు. టి.ఆంజనేయులు మాట్లాడారు.

ప్రజాశక్తి-ఈపూరు : ఈపూరు, బొల్లాపల్లి ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీలు స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట సమ్మె శిబిరాన్ని కొనసాగించారు. సిఐటియు నాయకులు మేడికొండ దేవసహాయం మాట్లాడారు. కొచ్చర్లలో అంగన్వాడీ కేంద్రాలకు సూపర్‌వైజర్లు తాళాలు పగలగొట్టి తెరిచారని, వాటిని ఎలా నిర్వహిస్తారో చూస్తామని హెచ్చరించారు.

ప్రజాశక్తి-పిడుగురాళ్ల : సమ్మెలో భాగంగా అంగన్వాడీలు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలలను పగలగొట్టడాన్ని నిరసిస్తూ పోలీస్‌ స్టేషన్‌ వరకు ప్రదర్శన చేశారు. తాళాలు పగలగొట్టిన వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి టి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికైనా నిర్బంధాన్ని విడనాడి అంగన్వాడీల డిమాండ్లను అంగీకరించాలని కోరారు. లేకుంటే సమ్మె మరింత ఉధృతమవుతుందని హెచ్చరించారు. యూనియన్‌ ప్రాజెక్టు అధ్యక్ష, కార్యదర్శులు షేక్‌ హజ్రా, డి.శాంతమణి మాట్లాడుతూ ఆదివారం సెంటర్‌ పరిధిలో పిల్లలు, లబ్ధిదార్లతో నిరసన తెలుపుతామని, సోమవారం గురజాల ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన చేపడతామని చెప్పారు. అంగన్వాడీలంతా తరలిరావాలని పిలుపునిచ్చారు. సమ్మె శిబిరంలో అంగన్వాడి వర్కర్స్‌ శివరంజని, కవిత, వెంకటరమ, భ్రమరాంబ, నాగలక్ష్మి, పద్మ, వరలక్ష్మి, సువర్ణ రాణి, శ్రీదేవి పాల్గొన్నారు.

ప్రజాశక్తి-దాచేపల్లి: గురజాలలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట కళ్లకు గంతలతో అంగన్వాడీలు నిరసన తెలిపారు. సిఐటియు పల్నాడు జిల్లా సహాయ కార్యదర్శి టి.శ్రీనివాసరావు మాట్లాడుతూ అంగన్వాడీలకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ, కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రాజెక్టు నాయకులు దేవకుమారి మాట్లాడుతూ ఆదివారం అంగన్వాడీ కేంద్రాల వద్ద పిల్లలు, లబ్ధిదార్లతో నిరసన, సోమవారం ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన చేపడతామన్నారు. సమ్మెలో రత్నం, రాధా, సుమతి, షేక్‌ సైదాబీ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీకి సమ్మె శిబిరంలో అంగన్వాడీలు నివాళులర్పించారు.

ప్రజాశక్తి – అమరావతి :స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద సమ్మె శిబిరం ఐదో రోజు కొనసాగింది. శిబిరాన్ని సందర్శించిన సిఐటియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు జి.రవిబాబు మాట్లాడుతూ ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడాలని, బెదింపులు మానుకోవాలని కోరారు. కేంద్రాల తాళాలు పగలగొట్టడం దొంగలు చేసే పనిగా అభివర్ణించారు. అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను విస్మరించిన జగన్‌మోహన్‌రెడ్డి.. తమ ప్రభుత్వం అంతా చేసిందంటూ చర్చల సందర్భంగా పదేపదే చెప్పడం, అబద్ధపు ప్రచారాలు చేసుకోవడాన్ని తిప్పికొట్టాలని అంగన్వాడీలకు పిలుపునిచ్చారు. డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించే వరకూ సమ్మెను కొనసాగించాలన్నారు. సమ్మె శిబిరాన్ని టిడిపి, జనసేన, కాంగ్రెస్‌ పార్టీలు నాయకులు సందర్శించి అంగన్వాడీలకు మద్దతు తెలిపారు. సిఐటియు మండల కార్యదర్శి బి.సూరిబాబు, జనసేన నాయకులు ఆర్‌.సత్యనారాయణ, ఎస్‌.గోపికృష్ణ, టిడిపి నాయకులు బి.వెంకటేశ్వరరావు, కె.వసంతరావు, షేక్‌ జానీ, సిహెచ్‌.శౌరి, సుందర్‌రావు, బాబు, యువజన కాంగ్రెస్‌ పల్నాడు జిల్లా అధ్యక్షులు గంటా గోపి, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు షేక్‌ బాజీ, జి.తిరుపతరావు, బి.గోపి మద్దతు తెలిపారు. ఇదిలా ఉండగా వైకుంఠపురంలోని అంగన్వాడి కేంద్రం తాళాన్ని అధికారులు పగలగొట్టారు. కేంద్రంలోని సరుకులు, రికార్డులను సచివాల సిబ్బందికి అందించారు. అనంతరం కొత్త తాళం వేయడంతోపాటు కేంద్రాలను నిర్వహించాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు.

ప్రజాశక్తి – మాచర్ల : స్థానిక అంబేద్కర్‌ సెంటర్‌లో అంగన్వాడీల సమ్మె శిబిరాన్ని టిడిపి, జనసేన నాయకులతో కలిసి తెలుగు యువత రాష్ట్ర అర్గనైజింగ్‌ సెక్రెటరీ కుర్రి శివారెడ్డి సందర్శించి మద్దతు తెలిపారు. 48 ఏళ్లుగా గర్భిణీలకు, బాలిం తలకు, చిన్న పిల్లలకు విశేష సేవలు అందిస్తున్న అంగన్‌వాడీలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించడం సరికాదన్నారు. వారి డిమాండ్లు న్యాయమై నవని, వాటిని అంగీకరించాలని కోరారు. మద్దతు తెలిపిన వారిలో టిడిపి పట్టణ అధ్య క్షులు కె.దుర్గారావు, జనసేన సమన్వయకర్త బి.రామాంజనేయులు, కార్యదర్శి పి.హరి, నాయకులు బి.శ్రీనివాసరావు, మంజుల ఆంజి, భవాని శంకర్‌, సిహెచ్‌.హరిబాబు, మల్లయ్య, క్రిష్ణ, శ్రీనివాసరావు, సాంబశివరావు, జ్యోతి, ఆంజి ఉన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు ఉషారాణి, ఇందిరా, కె.పద్మావతి, కోటేశ్వరి, సుందరలీల, రుక్మిణి, మహలక్ష్మీ, శివపార్వతీ, జిజి భారు, రహేనా, చంద్రకళ, లీలావతి, వెంకటరమణ, నాగలక్ష్మీ, రాధ, హైమవతి పాల్గొన్నారు.

➡️